అడ్డంగా దొరికిపోయిన జిబ్రాన్.. సాహో BGM కూడా కాపీనే.. అది కూడా తెలుగు సినిమా నుండే..?

ఏ సినీ ఇండస్ట్రీ అయినా సరే అది ఎంత పెద్ద సినిమా అయినా సరే ఒక సినిమాకు సంగీతం అనేది సరిగ్గా లేకపోతే సినిమా ఫలితమే వేరేలా వచ్చేస్తుంది.కథ ఎలా ఉన్నాసరే హీరోను ఎలివేట్ చేస్తూ సరైన మాస్ మసాలా సీన్స్ ఒక అదిరిపోయే బిజీయమ్(బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్) కానీ పడితే ఆ సినిమా రిజల్ట్ వేరే స్థాయిలో ఉంటుంది.ఒక సినిమా చూస్తున్నప్పుడు మనకు తెలీకుండానే ఆ సినిమాలో లీనం అయ్యేలా చేసే పవర్ ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు మాత్రమే ఉంటుందని చెప్పడంలో డౌటే లేదు.అయితే ఎంతో మంది సంగీత దర్శకులు ఉన్న మన భారతీయ సంగీత దర్శకుల్లో కేవలం కొంత మంది మాత్రమే బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్టులు ఉన్నారు.

అలాంటి వారిలో ప్రముఖ సంగీత దర్శకుడు జిబ్రాన్ కూడా ఒకరు.అయితే తాజాగా జిబ్రాన్ టాలీవుడ్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ “సాహో”కు బ్యాక్గ్రౌండ్ అందించారు.అయితే సినిమాకు అతను అందించిన సంగీతం అద్భుతంగా ఉన్నా ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం దొరికేసారు.ఈ సినిమాకు ఇచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అచ్చు గుద్దినట్టుగా దేవిశ్రీ ప్రసాద్ మెగాస్టార్ చిరు నటించిన “ఖైదీ నెంబర్ 150” కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ చేసేసారు.సినిమా చూస్తున్నప్పుడు ఆ అనుమానం కూడా ప్రతి ఒక్కరికి కలిగి ఉండొచ్చు.ఒకసారి ఆ రెండు బ్యాక్గ్రౌండ్ స్కోర్లను ఈ కింద ఉన్న వీడియోల ద్వారా వినండి.