యువ నటుడు కన్నుమూత.. విషాదంలో చిత్ర పరిశ్రమ

బాలీవుడ్ నటుడు అమిత్ పురోహిత్ కన్నుమూశారు. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు హీరోగా 2018లో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమాలో హీరోయిన్ అదితిరావ్ హైదరీ మాజీ ప్రియుడిగా అమిత్ పురోహిత్ నటించిన విషయం తెలిసిందే. ప్రేమకథగా వచ్చిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అమిత్‌ పురోహిత్‌ మృతిపై సుధీర్‌బాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అమిత్‌ మృతికిగల కారణాలు తెలియాల్సి ఉంది.అమిత్‌ హిందీలో ‘పంక్‌’ (2010), ‘ఆలాప్‌’ (2012) తదితర చిత్రాల్లో నటించారు.

అమిత్‌ పురోహిత్‌ మరణం నన్నెంతో బాధించింది. ‘సమ్మోహనం’ సినిమాలో సమీరా మాజీ ప్రియుడిగా నటించిన అతడు చాలా స్నేహంగా ఉండేవారు. ప్రతి షాట్‌కు 100 శాతం న్యాయం చేసేవాడు. నైపుణ్యం ఉన్న ఓ మంచి యువ నటుడు మనల్ని విడిచి వెళ్లిపోయారు. అతడి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నా అని సుధీర్ బాబు ట్వీట్ చేశాడు. అమిత్‌ మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘దీన్ని నమ్మలేకపోతున్నా. నేను కలిసి పనిచేసిన వారిలో అమిత్‌ పురోహిత్‌ ఎంతో వినయం, నిబద్ధత, నైపుణ్యం కలిగిన నటుడు. అమిత్‌.. నేను నిన్ను మిస్‌ అవుతున్నా. నిన్ను నా తర్వాతి సినిమాకు తీసుకోవాలి అనుకున్నా. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అని ఆయన ట్వీట్ చేశారు.