ప్రెగ్నెంట్ మహిళ వివాదం… రెడ్‌హ్యాండెడ్‌గా బుక్కైన వైసిపి-బిజెపి

వైఎస్సార్ కాంగ్రెస్, బిజెపిల మధ్య రహస్య ఒప్పందాలు నడుస్తున్నాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. మొన్నామధ్య వైసిపికి చెందిన ఒక లీడర్ స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయాన్ని అంగీకరించాడు కూడా! కాకపోతే వైసిపి నేతలే దాన్ని కప్పిపుచ్చేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఇప్పుడు తమ ప్లాన్ బయటపడితే ఎన్నికల్లో ప్రభావం పడే అవకాశం ఉందని… తమ పొత్తును దాచిపెట్టేందుకు డొంకు తిరుగుడు వ్యవహారాలకు పాల్పడుతున్నారు. అయితే… ఇంతలో చోటు చేసుకున్న మరో సంఘటన ఈ పార్టీలు కప్పుకున్న ముసుగుల్ని తీసిపారేసింది.

ఇటీవల వైజాగ్‌లో ఓ వైసిపి కార్యకర్త తన ఇంట్లో అద్దెకు ఉంటున్న ప్రెగ్నెంట్ మహిళ కుటుంబసభ్యుల్ని తమ పార్టీని సపోర్ట్ చేయడం లేదని దారుణంగా కొట్టిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. వైసిపి ప్రచారంలో పాల్గొనాలని, ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేయాలని, అందుకు డబ్బులు కూడా ఇస్తామని ఆ కార్యకర్త చెప్పాడు. కానీ… తమ సపోర్ట్ కేవలం జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌కేనని తేల్చి చెప్పడంతో… బహిరంగంగా అతగాడు ఆ కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళాసంఘాలు వెంటనే రంగంలోకి దిగి.. దీనిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడా ప్రెగ్నెంట్ మహిళ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఈ వివాదం మరింత అగ్గిరాజుకుంది. దీంతో వారం రోజులు గడిచిన అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిష్ట్రర్ చేశారు.

ఇప్పుడు ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. నిజానికి… ఆ కుటుంబంపై దాడి చేసింది వైసిపి కార్యకర్త అయితే, అతడ్ని ఇప్పుడు బిజెపి లీడర్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనతో వైసిపికి ఎలాంటి లింక్ లేదని, ఇదంతా బిజెపినే చేయించిందని నమ్మబలికేందుకు ప్రయత్నిస్తున్నారు. లోకల్ వైసిపి లీడర్స్‌కి తలొగ్గి… పోలీసులు కూడా ఈ సరికొత్త డ్రామాకు వత్తాసు పలుకుతున్నట్టు సమాచారం! దీంతో వైసిపి, బిజెపిల మధ్య నిజంగా గాఢ సంబంధాలున్నాయని మరోసారి నిరూపితమైంది. కేవలం తమకు సపోర్ట్ చేయలేదనే అక్కసుతో ఒక కుటుంబంపై జాలి లేకుండా దారుణంగా కొట్టడం నిజంగా సిగ్గుచేటు!