వరల్డ్ ఫేమస్ లవర్ కాదు…అర్జున్ రెడ్డీ

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ తాజా చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ టీజర్‌ తాజాగా రిలీజైంది. ‘ప్రేమంటే కాంప్రమైజ్‌ కాదు గౌతమ్‌ శాక్రిఫైస్‌, ప్రేమంటే దైవత్వం అయినా ఇవన్నీ నీకర్ధం కావులే..’ అంటూ రాశీఖన్నా ఎమోషనల్‌ డైలాగులతో టీజర్‌ స్టార్ట్‌ అయ్యింది. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ ఎంట్రీ రగ్గ్‌డ్‌ లుక్స్‌.. అచ్చం ‘అర్జున్‌రెడ్డి’ని గుర్తు చేశాడు. మధ్య మధ్యలో నీట్‌ షేవ్‌తో రొమాంటిక్‌ బోయ్‌లా కనిపించాడు. నలుగురు హీరోయిన్లు రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, ఇసాబెల్లె, కేథరీన్‌లకు ఈ టీజర్‌లో చోటు దక్కింది.

నలుగురితోనూ విజయ్‌ దేవరకొండ క్లోజ్‌గానే మూవ్‌ అవుతున్న సన్నివేశాలున్నాయి.అక్కడక్కడా విజయ్‌ చాలా చాలా ఎమోషనల్‌గా కనిపించాడు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి స్వీట్‌ కూల్‌ కామ్‌ అండ్‌ ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీని తెరకెక్కించిన క్రాంతి మాధవ్‌ ఈ సినిమాకి దర్శకుడు. నలుగురు హీరోయిన్స్‌తో ఈ లవ్‌ స్టోరీని ఎలా డీల్‌ చేశాడో చూడాలంటే, ఫిబ్రవరి 14 వరకూ ఆగాల్సిందే. ఆ రోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్‌కి మంచి రెస్పాన్సే వస్తోంది. రౌడీ మార్క్‌ టీజర్‌ ఇది. అసలే యూ ట్యూబ్‌ సెన్సేషనల్‌ స్టార్‌, యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉన్న హీరో.. మరి తాజా టీజర్‌తో ఎలాంటి సంచలనాలకు తెర లేపుతాడో చూడాలిక.