ఎండుకొబ్బరితో ఇన్ని ప్రయోజనాలా..! మహిళలు తప్పక తెలుసుకోండి

బరువు తగ్గాలంటే ఎండుకొబ్బరి తినాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే… రోజూ ఎండు కొబ్బరి టేస్ట్ చూడాలి. ఇంకా చాలా ప్రయోజనాలు. డ్రై కోకోనట్… జీర్ణం అవ్వడానికి కాస్త టైమ్ తీసుకుంటుంది కానీ… మన శరీరానికి మాత్రం ఎంతో మేలు చేస్తుంది. ఎండుకొబ్బరిలో ఫైబర్, కాపర్, సెలీనియం వంటి పోషకాలుంటాయి. అందుకే… చాలా వంటలు, స్వీట్లలో ఎండుకొబ్బరిని వేస్తారు. మార్కెట్లో ఎండుకొబ్బరి పొడి కూడా దొరుకుంది. అది కొనుక్కొని… కూరల్లో కాస్త కాస్త వేసుకుంటూ ఉంటే… ఇంటిల్లిపాదికీ ఆరోగ్యమే. కూరకి అదనపు టేస్ట్ కూడా వస్తుంది. తరచూ తలనొప్పులతో బాధపడేవారు… రోజూ ఎండు కొబ్బరి కాస్త తింటూ ఉంటే… బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంతేకాదు… రకరకాల వ్యాధుల్ని తరిమికొట్టే శక్తి కూడా డ్రై కోకోనట్‌కి ఉంది.

ఎండు కొబ్బరితో ఆరోగ్య ప్రయోజనాలు :

కొబ్బరిలో ట్రాన్స్‌ఫ్యాట్స్ ఎక్కువ అనే ఉద్దేశంతో కొంత మంది దాన్ని తినరు. కావచ్చు గానీ… అంతకంటే ఎక్కువగా ప్రయోజనాలు కూడా ఉండటం వల్ల… ఇప్పుడు ప్రపంచమంతా ప్రజలు రోజూ ఎండుకొబ్బరి తింటున్నారు. ఎండుకొబ్బరిలో ఫైబర్, కాపర్, మ్యాంగనీస్, సెలీనియం దీన్ని… ది బెస్ట్ ఫుడ్‌గా మార్చేశాయి. రోజూ చిన్న ఎండుకొబ్బరి ముక్క తింటే… అందులోని ఫైబర్ వల్ల… గుండె హాయిగా ఉంటుంది. మగవాళ్లు రోజూ 38 గ్రాములు, లేడీస్ రోజూ 25 గ్రాములు తినాలి.ఈ రోజుల్లో సౌండ్ పొల్యూషన్, టెన్షన్ల వల్ల చాలా మందికి బ్రెయిన్ దెబ్బతింటోంది. తల తిరుగుతోంది. అలాంటి వాళ్లు రోజూ ఎండుకొబ్బరి తింటే… ఓ వారం తర్వాత నుంచీ మార్పు కనిపిస్తుంది. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. మతిమరపు సమస్యలు దూరమవుతాయి.

ఎండుకొబ్బరి రకరకాల వ్యాధుల్ని రాకుండా చేస్తుంది. ఎందుకంటే అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ తింటూ ఉంటే… మనం ఆరోగ్యంగా అయిపోతాం.మగాళ్లలో మగతనాన్ని పెంచే లక్షణం ఎండుకొబ్బరిలో ఉందని పరిశోధనల్లో తేలింది. సంతాన భాగ్యం ప్రసాదిస్తుంది. స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. వంధత్వాన్ని నివారిస్తుంది. ఇందుకు కారణం డ్రై కోకోనట్‌లోని సెలీనియమే.కాన్సర్ వ్యాధి ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేం. కానీ… రోజూ ఎండుకొబ్బరి తినేవాళ్లకు కాన్సర్ రావట్లేదు. ఆల్రెడీ వ్యాధి సోకిన వాళ్లు కూడా ఎండుకొబ్బరి తింటే… ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పేగుల్లో కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్‌కి ఎండుకొబ్బరి చక్కటి మందులా పనిచేస్తోంది.మీకు కీళ్ల నొప్పులు, ఎముకలు పెళుసుబారిపోవడం లాంటి సమస్యలు ఉంటే… మీరు ఎండుకొబ్బరి తినడం మేలు. ఆ సమస్యలు లేకపోయినా… అవి రాకుండా ఉండేందుకు తింటే మంచిదే.

మలబద్ధకం, అల్సర్ వంటి పొట్ట సంబంధిత సమస్యలు ఏవి ఉన్నా సరే… రోజూ చిన్న ముక్క ఎండుకొబ్బరి తినేయాలి. కచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తుంది. మన దేశంలో మహిళలు సరిగా భోజనం చెయ్యట్లేదని పరిశోధనల్లో తేలింది. ఇంట్లో భర్త, పిల్లలు తినగా మిగిలిన కాస్త భోజనమే వాళ్లు తింటున్నారనీ… అందువల్ల వాళ్లలో సరిపడా బ్లడ్ ఉండట్లేదని డాక్టర్లు అంటున్నా్రు. అందువల్ల మహిళలు తప్పనిసరిగా ఎండుకొబ్బరి తినాలి. ఫలితంగా వారిలో ఐరన్ పెరిగి… ఆరోగ్యంగా ఉంటారు. ఎనీమియా (రక్తహీనత) సమస్యకు చెక్ పెట్టాలంటే… డ్రై కోకోనట్‌ను నోట్లో వేసుకొని… కరకరా నమిలేయాల్సిందే.