కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే మీ జుట్టు పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది

జుట్టు మృదువుగా ఉండాలన్నా, చుండ్రును వదిలించుకోవాలన్నా నువ్వుల నూనెను వారానికి ఓసారి మర్దన చేయడం మంచిది అని చెపుతున్నారు సౌందర్య నిపుణులు. నువ్వుల నూనెతో జుట్టుకి కావల్సిన పోషకాలు అందుతాయి. నువ్వుల నూనె ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

నువ్వుల నూనెతో కేశాలకు మరియు తలకు బాగా పట్టిస్తే, హెయిర్‌ సెల్స్‌ యాక్టివ్‌‌గా ఉండి హెయిర్‌ గ్రోత్‌‌ను ప్రోత్సహిస్తుంది. అతినీలలోహిత కిరణాల ప్రభావం జుట్టు మీద పడకుండా నువ్వుల నూనె రక్షిస్తుంది. చాలావరకు జుట్టు సమస్యలు చుండ్రు వల్లనే ఎదురవుతాయి. చుండ్రు సంబంధిత సమస్యలను నివారించడానికి ఒక అద్భుతమైన మార్గం నువ్వుల నూనె. కాబట్టి వారంలో ఓసారి నువ్వుల నూనెను మర్దించి తలస్నానం చేయడం మంచిది.