ఆ ఇద్దరిలోనే..? బిగ్ బాస్ విన్నర్ ఏవరంటే..?

బిగ్ బాస్ సీజన్ 3 మరో మూడు, నాలుగు వారాల్లో షో ముగుస్తుందని తెలిసిందే. కింగ్ నాగార్జున హోస్ట్ గా మొదట్లో మంచి రేటింగ్ తెచ్చుకున్న బిగ్ బాస్ షో మధ్యలో నీరసంగా నడిచింది. అయితే షో ముగింపు దశకు చేరుకోవడం వల్ల మళ్లీ ఇప్పుడు కాస్త ఆసక్తిని కలిగిస్తుంది. ప్రస్తుతం 8 మంది సభ్యులున్న బిగ్ బాస్ హౌజ్ లో టైటిల్ విన్నర్ గా అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది అన్నది పెద్ద టాస్క్ అయ్యింది.సోషల్ మీడియాలో ఎవరి ఫాలోవర్స్ మా వాడే టైటిల్ విన్నర్ అంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పటికి వరకు జరిగిన షో చూస్తే ఉన్న 8 మందిలో టాప్ 5 తీస్తే శ్రీముఖి, వరుణ్, శివ జ్యోతి, బాబా భాస్కర్, రాహుల్ వస్తారు. అయితే అలి రెజా కూడా టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉన్నా సరే అతను ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి మళ్లీ వైల్డ్ కార్డ్ గా వచ్చాడు కాబట్టి అతనికి టైటిల్ గెలిచే ఛాన్స్ లేదు.

అలి రెజా వైల్డ్ కార్డ్ గా లోపలకు వచ్చాక తన ఆట తీరు మార్చాడు. అది చాలు అతనికి బయట గేమ్ ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అర్ధమైందని చెప్పడానికి. ఇదిలాఉంటే బాబా భాస్కర్, వితిక కూడా ఇన్నాళ్లు హౌజ్ లో పోటీ పడుతూ వచ్చారు. సగం సీజన్ బాబా భాస్కర్ మొహమాటంతోనే గడిపేశారు. హౌజ్ లో అందరిచేత మంచోడని అనిపించుకున్న బాబా భాస్కర్ టైటిల్ గెలుచుకోవడం మాత్రం అసాధ్యమని అంటున్నారు.ఇక ఇదే క్రమంలో టాప్ 3కి వస్తే మాత్రం వరుణ్, శ్రీముఖిలు పక్కాగా ఉంటారని తెలుస్తుండగా.. రాహుల్, శివ జ్యోతిల మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుంది. రాహుల్ కు సోషల్ మీడియా ఫ్యాన్స్ ఎక్కువ. అతని ఆల్బంస్ ఈమధ్య చాలా పాపులర్ అయ్యాయి. అందుకే రాహుల్ టాప్ 3లో ఉంటాడని అందరు అనుకుంటున్నారు. అయితే శివజ్యోతికి ఆ ఛాన్స్ ఉందని అంటున్నారు. ఫైనల్ గా టైటిల్ గెలిచే అవకాశాలు మాత్రం వరుణ్ సందేష్ కే ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది.

శ్రీముఖి టాప్ 2లో ఉంటుందని టాక్. సీజన్ 1 టైటిల్ విన్నర్ విషయంలో రెండు మూడు వారాల ముందే శివ బాలాజి గెలుస్తాడని తెలిసిపోయింది. ఇక సీజన్ 2 అయితే కౌశల్ ఆర్మీ వల్ల కౌశలే విన్నర్ అని ముందే ఫిక్స్ అయ్యారు. కాని ఈ సీజన్ మాత్రం విన్నర్ ఎవరన్నది గెలిచే దాకా చెప్పడం కష్టమని చెప్పొచ్చు.