జార్జి రెడ్డి అర్జున్ రెడ్డి తమ్ముడా..? వైరల్ అవుతున్న షాకింగ్ వీడియోస్

`జార్జిరెడ్డి` చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత‌ అభిషేక్ నామా రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ఉస్మానియా రెబ‌ల్ స్టూడెంట్ జార్జిరెడ్డి బ‌యోపిక్ ఇది. ట్రైల‌ర్ ఇటీవలే రిలీజై ఆక‌ట్టుకుంది. ద‌ళం ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శక‌త్వం వ‌హిస్తున్నారు.  `వంగవీటి` ఫేం సందీప్ మాధవ్  (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించారు. మనోజ్ నందన్- చైతన్య కృష్ణ- శత్రు- వినయ్ వర్మ- తిరువీర్- అభయ్ న‌టీన‌టులు. హీరో సత్య దేవ్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా రిలీజ్ పై స‌రైన క్లారిటీ రాలేదింకా. అయితే ఈలోగానే జార్జిరెడ్డిపై ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

జార్జ్ రెడ్డి గురించి సోష‌ల్ మీడియా వేదిక‌గా చిన్నారులు (కిడ్స్) ప్ర‌శ్నిస్తోన్న తీరు  చూస్తుంటే న‌వ్వు రాకుండా ఉండ‌దు. జార్జ్ రెడ్డి అర్జున్ రెడ్డికి ఏమ‌వుతాడు?  అర్జున్ రెడ్డికి జార్జ్ రెడ్డి అన్న‌య్యా త‌మ్ముడా? అంటూ తెలిసీ తెలియ‌క‌ అమాయ‌కంగా అడుగుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన్ని క్లిప్స్ ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో అది కాస్తా వైర‌ల్ గా మారింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన జార్జ్ రెడ్డి ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత  కిడ్స్ ఇలా ప్ర‌శ్నించడం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. హిస్టారిక‌ల్ సినిమాల‌కు..  క‌మ‌ర్శియ‌ల్ సినిమాల‌కు.. బ‌యోపిక్ సినిమాల‌కు ఉన్న‌ తేడా తెలియ‌కుండా పోతోంద‌ని దీన్ని బ‌ట్టి భావించాలి. మ‌రి ఈ ఆజ్ఞానానికి కార‌ణం పేరెంట్ కే స‌రైన అవ‌గాహ‌నా లోప‌మా?  లేక  ప్ర‌స్తుత విద్యా విధానం వ‌ల్ల ఇలా జ‌రుగుతోందా?  క‌నీసం తెలంగాణ కిడ్స్ కి అయినా జార్జి రెడ్డి గురించి తెలియ‌లేదంటే ఏమ‌ని అనుకోవాలి? మ‌రి ఈ సినిమాని ఆంధ్రాలో రిలీజ్ చేస్తున్నారు.. అక్క‌డేమైనా అర్థ‌మ‌వుతుందా.. ఆయ‌నెవ‌రో?

Recommended For You

Leave a Reply

Your email address will not be published.