బిగ్ బాస్ నుండి మహేష్ విట్ట బయటపడటానికి అసలు కారణం ఇదేనా..?

తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 3 షో ఇక రోజు రోజు కీ ఉత్కంఠంగా మారిపోతుంది. ఇంటి సభ్యులు మొన్నటి వరకు అల్లిబిల్లిగా ఆటలు, టాస్కులు ఆడినా ఇక ముందు అంతా సిరియస్ అంటున్నారు కింగ్ నాగార్జున. ఇందుకు ఉదాహారణే నిన్నటి ఎలిమినేషన్. నిన్నటి వరకు అందరూ వరుణ్ సందేష్ ఎలిమినేషన్ అవుతారని భావించారు..కానీ అనూహ్యంగా మహేష్ విట్టాఎలిమినేషన్ కావడం అందరికీ ఆశ్చర్యం వేసింది. ఇప్పటికి హౌజ్ లో ఎనిమిది మంది ఉండగా నిన్న మహేష్ విట్టా ఎలిమినే అయ్యాడు. ఈ వారం నామినేట్ లో ముగ్గురూ టఫ్ కావడంతో హౌజ్ లో నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరా అన్న దానిపై రక రకాల సందేహాలు వచ్చాయి.వరుణ్, రాహుల్, మహేష్ ముగ్గురికీ ఓటింగ్ పోటాపోటీగా జరగడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది.

మొత్తం టాస్కులు, కంటెస్టెంట్ల గొడవలతో వీకెండ్ హీట్‌ను రైజ్ చేస్తుంటే.. ఎలిమినేషన్ ప్రక్రియ వచ్చేసరికి ఒక రోజు ముందుగానే ఎలిమినేట్ అయ్యే ఇంటి సభ్యుడి పేరు సోషల్ మీడియాలో దర్శనమిస్తుండటంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. రాహుల్‌‌ని ఎలిమినేట్ చేయకుండానే సీక్రెట్ రూంలో ఉంచి కథ నడిపిన బిగ్ బాస్.. అలీకి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్లీ పంపించారు. ఇది ఇలా ఉంటే 12వ వారం ఎలిమినేషన్‌కు వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్టాలు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మద్య వరుణ్ సందేష్ టాస్కులు వీక్ గా ఉండటం..ఒకటీ రెండు కాంట్రవర్సీలు చేయడంతో ఆయనకు ఓటింగ్ తక్కువ వచ్చి ఉంటుందని ఊహించారు.

అయితే ఎక్కడా కూడా ఉత్కంఠ అనేది లేకుండా ఆదివారం ఎపిసోడ్‌లో మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యాడని హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. దీనితో హౌస్‌లో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, వితిక షేరు, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, శివ జ్యోతిలు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే. కాగా, ఈ వారం ఎలిమినేషన్‌కు ఎవరు నామినేట్ అవుతారో.. ఫైనల్ ఫోర్‌కు ఎంపికయ్యేది ఎవరో వేచి చూడాలి.