RRR లో అసలు సమస్య ఇదే..? అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా..?

భారీ బడ్జెట్ తో నిర్మించే సినిమాలు అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా కష్టం అన్న విషయం గతంలో చాలా సందర్భాల్లో రుజువైంది. అది మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లో కూడా ఇలా జరగడం చాలా కామన్. కారణాలు చాలానే ఉంటాయి. నటీ నటుల డేట్స్ క్లాష్ అవడం దగ్గర్నుంచి గ్రాఫిక్స్ , విజువల్ ఎఫెక్ట్స్ టైం కి ఫినిష్ అవకపోతే అటోమేటిక్ గా సినిమా రిలీజ్ చాలానే డిలే అవుతుంది. ఇప్పుడు అలాగే టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కూడా బాగా డిలే అవుతుందని తాజా సమాచారం. ఆర్ ఆర్ ఆర్. తెలుగులో రాబోతున్న హెవీ బడ్జెట్ సినిమా. ప్రస్తుతానికి ఈ రేంజ్ లో నిర్మాణంలో వున్న సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదొక్కటే. సాహో, సైరా తర్వాత రిలీజ్ కి మిగిలింది ఈ సినిమానే.

ఈ సినిమాను 2020 సమ్మర్ కు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించారు. అయితే ఇప్పుడు వినవస్తున్న తాజా సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ 2021 విడుదల అని తెలుస్తోంది. అంటే దాదాపు సంవత్సరం డిలే అవుతుందట. ఇలాంటి వార్తలు వినపడడానికి రెండు కారణాలు. ఒకటి ఆర్ఆర్ఆర్ వర్క్ దాదాపు జూలై వరకు జరుగుతుండటం. సినిమా పూర్తయ్యేసరికి సమ్మర్ దాటిపోతుంది. దసరా సీజన్ ఈ సినిమాకు వర్కౌట్ అవుతుందా అంటే అనుమానమే. ఇటీవల దసరా ముందు, వెనుక మూడు భారీ సినిమాలు విడుదలయ్యాయి. అంతగా వర్కౌట్ కాలేదు.వార్, సాహో, సైరా సినిమాల ఫలితం చూసిన తరువాత సమ్మర్ మాత్రమే పెద్ద సినిమాలకు సరైన సీజన్ అన్న ఆలోచన ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి కి వచ్చిందని తెలుస్తుంది.

అంటే 2021 జూలై నుంచి డిసెంబర్ లోపు రిలీజ్ చేసే అవకాశం ఉందని అర్థమవుతోంది. రాజమౌళి అండ్ టీమ్ ఎంత ట్రై చేసినా 2020 లో రావడం కష్టమని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇక ఇంతవరకు తారక్ సరసన నటించే హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేయలేదు. మరి ఈ వ్యవహారం ఎప్పుడు కంప్లీటవుతుందో తెలీదు.