బాబా భాస్కర్ పై ఫుల్ నెగిటివ్.. బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది

తెలుగు సెన్సేషనల్ రియాలిటీ గేమ్ షో “బిగ్ బాస్” మూడవ సీజన్ అంతిమ దశకు చేరుకుంటుంది.నిన్న 84 వ రోజున సండే ఫన్ డే గా కొనసాగడంతో పాటుగా మహేష్ విట్టా ఎలిమినేషన్ తో కాస్త బాధాకరంగానే ముగిసింది.అంతకంటే ఎమోషనల్ అయ్యిన అంశం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా బాబా భాస్కర్ మాస్టర్ కంటతడి పెట్టుకోవడం అనే చెప్పాలి.ఇంతకు ముందు ఒకసారి బాబా బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ అయ్యారు.దీనితో బాబా సపోర్టర్స్ కూడా బాగా ఎమోషనల్ అయ్యిపోయారు.

కానీ ఈసారి మాత్రం బాబా ఏడ్చేయ్యడంతో ఆయన అభిమానులు అది చూడలేకపోయారు.అయితే బాబాపై సింపతీ చూపించిన వారు ఎలా అయితే ఉన్నారో అలాగే బాబాపము నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్న వారు కూడా లేకపోలేరు. అయితే ఇలా నెగిటివిటీని చెప్తున్నా వారిలో పాయింట్ కూడా లేకపోలేదు.ఎందుకంటే బాబా మిగతా హౌస్ మేట్స్ తో పోల్చుకుంటే చాలా సెన్సిటివ్ అని అందరికి తెలుసు కానీ అలాగే తన స్టైల్ లో తన ఆట ఆడుతారు కానీ బాబాలో ఉన్న అతి పెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే తనలో తనకి ఒక క్లారిటీ లేకపోవడం.

నిన్న నాగ్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకసారి టాస్క్ ఆడదానికి వచ్చానంటారు బిగ్ బాస్ టైటిల్ పై ఇష్టం లేదు అంటారు కానీ తాను చెప్పాలి అనుకున్నది కరెక్ట్ గా చెప్పలేకపోయారు.ఇలా బాబా కాస్త డైలమాలో ఉన్నట్టు బాబా అభిమానులకే అనిపించి ఉండొచ్చు.ఈ విషయంలో బాబా కనుక కాస్త సెట్టయ్యినట్టయితే ఆల్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.