రకుల్ ఏంటి ఇలాంటి కోరికలు కోరుతుంది….

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దు గుమ్మ రకుల్ ప్రీతి సింగ్..చిన్న చిత్రంతో చిన్న హీరో తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ..ఆ తర్వాత పెద్ద బ్యానర్ లలో నటించి అగ్ర హీరోల పక్కన రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకుంది. రెండేళ్ల పాటు రకుల్ పేరు ఇండస్ట్రీ లో మారుమోగింది. ఆ తర్వాత కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం తెలుగు లో ఒకటి అరా తప్ప మరో అవకాశం లేదు.

హిందీలో ఆమె చేసిన ‘మర్జవాన్’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాపై ఆమె చాలానే ఆశలు పెట్టుకుంది. ఇందులో సిద్దార్ధ మల్హోత్రా హీరో. తార సుతారా హీరోయిన్. ఇందులో రకుల్ కూడా ఓ హీరోయిన్ గా చేస్తున్నది. ఇది ముక్కోణపు లవ్ స్టోరీ. విరహవేదన అనుభవించే ప్రేమికురాలిగా ఇందులో రకుల్ కనిపిస్తోందట. ఇప్పటికే సోషల్ మీడియా లో హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తున్న ఈ బ్యూటీ ..ఇప్పుడు విరహవేదం తో ఎలా కనిపిస్తుందో చూడాలి.