వి.వి. వినాయక్ ఇలా అయ్యాడేంటి.. అస్సలు గుర్తుపట్టని విధంగా

ఇప్పుడు వినాయ‌క్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఒక‌ప్పుడు ఈయ‌న్ని త‌లుచుకోగానే నిండుగా ఉండే రూపం గుర్తుకు వ‌చ్చేది. ఎప్పుడూ అలా న‌వ్వుతూ క‌నిపిస్తుంటాడు వినాయ‌క్. అయినా ఈ ద‌ర్శ‌కుడి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. ఈయ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో సృష్టించిన సంచల‌నాల గురించి చెప్ప‌డానికి మాట‌లు కూడా స‌రిపోవు. తొలి సినిమా ఆది నుంచే రికార్డుల వేట మొద‌లుపెట్టాడు వినాయ‌క్.

ఆ త‌ర్వాత కూడా ఠాగూర్, దిల్, ల‌క్ష్మీ, కృష్ణ‌, ఖైదీ నెం 150 లాంటి సంచ‌ల‌న విజ‌యాల‌తో టాప్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు. కొన్నేళ్లుగా ఈయ‌న నుంచి స‌రైన సినిమా రావ‌డం లేదు. సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కించిన ఇంటిలిజెంట్ సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో కాంబినేష‌న్ సెట్ చేయ‌లేదు ఈయ‌న‌. ఈ ద‌ర్శ‌కుడితో సినిమా అంటే కూడా భ‌య‌ప‌డుతున్నారు హీరోలు. ఇదిలా ఉంటే ఇప్పుడు వినాయ‌క్ పూర్తిగా మారిపోయాడు.  బ‌రువు త‌గ్గిపోయి పూర్తిగా స‌న్న‌బ‌డ్డాడు వినాయ‌క్. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈయ‌న హీరోగా ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు. దీనికోస‌మే ఈయ‌న బ‌రువు త‌గ్గిపోయి.. పీల‌గా మారిపోయాడు. ఈ లుక్ అంత‌గా వినాయ‌క్‌కు స‌రిపోలేదంటున్నారు ఫ్యాన్స్.

ఏదేమైనా వ‌ర‌స ఫ్లాపులు వ‌చ్చేస‌రికి ద‌ర్శ‌కత్వం కాద‌ని న‌ట‌న వైపు వ‌చ్చేస్తున్నాడు వినాయ‌క్. మ‌రి ఇక్క‌డ ఆయ‌న‌కు అదృష్టం ఎలా క‌లిసి రానుందో..?