కేవలం15 వేలకే.. అదిరిపోయే ఫీచర్స్ తో Vivo Y5s

చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. Vivo Y5s స్మార్ట్ ఫోన్. భారీ 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో పాటు ట్రిపుల్ కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇటీవలే వివో Y సిరీస్ నుంచి Vivo Y19 మోడల్ ప్రవేశపెట్టింది. వివో Y5s లో MediaTeK హెలియో P65 SoC వినియోగించింది. అదే వివో U3 మోడల్ మాత్రం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 675 SoCతో వచ్చింది.ఇక Vivo Y5s 6GB + 128GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,498 (రూ.15వేలు)గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ మొత్తం మూడు కలర్లు బ్లూ, బ్లాక్, గ్రీన్, గ్రేడియంట్ ఫినీష్ తో రానుంది. త్వరలో Vivo Y5s సేల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి చైనా బయటి మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ చేయడంపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, కొన్ని గ్లోబల్ మార్కెట్లలో Vivo Y19 మోడల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

వివో Y5s మోడల్ 6.53 అంగుళాల Full HD+ స్క్రీన్.. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీతో వచ్చింది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ట్రిపుల్ కెమెరాల్లో 16MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో షూటర్ చిన్న కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా 16MP సెల్ఫీలకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంది. రియర్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ సపోర్ట్ చేస్తుంది. మరిన్ని ఫీచర్లు ఏంటో ఓసారి చూద్దాం.

వివో Y5s స్పెషిఫికేషన్లు – ఫీచర్లు ఇవే : 6.53-అంగుళాల full-HD+(1,080×2,340ఫిక్సల్స్) డిస్‌ప్లే,  ట్రిపుల్ కెమెరా సెటప్, Face Unlock సపోర్ట్, రియర్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, 16MP ప్రైమరీ షూటర్ (f/1.78 అప్రెచర్), 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా (f/2.2 అప్రెచర్), 2MP మ్యాక్రో షూటర్ (f/2.4 అప్రెచర్), 16MP సెల్ఫీ షూటర్ (f/2.0 అప్రెచర్, ఫ్రంట్ కెమెరా, 128GB ఆన్ బోర్డు స్టోరేజీ
అక్టా కోర్- MediaTek Helio P65 SoC, 6GB RAM + 128GB స్టోరేజీ, Mali-G52 GPU, 5,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యుయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, Micro-USB 2.0, 4G VoLTE సపోర్ట్ SIM ( డ్యుయల్ -SIM (Nano), Android 9 Pie, FunTouch OS 9.2