వీక్షకులకు కనులపండగ…ఒకే వేదికపై అలరించిన మెగాస్టార్, సూపర్ స్టార్, లేడి అమితాబ్

అవును ఒకే వేదికపై ముగ్గురు లెెజెండ్స్.. అదేనండి చిరంజీవి, విజయశాంతి, మహేష్ బాబు ఒకే వేదికపై సందడి చేసి ప్రేక్షనులను కనువిందు చేసారు. ఈ ముగ్గురి అపూర్వ కలయికకు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక అయింది.

 

గత కొన్నేళ్లుగా మహేష్ బాబు.. తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో వేరే హీరోల సాయం తీసుకుంటున్నాడు. ‘భరత్ అను నేను’ సినిమా కోసం ఎన్టీఆర్‌ను ఛీఫ్ గెస్ట్‌గా పిలిచిన సూపర్ స్టార్.. ఆ తర్వాత ‘మహర్షి’ సినిమా కోసం సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో విజయ్ దేవరకొండను ముఖ్య అతిథిలుగా పిలిచిన సంగతి తెలిసిందే కదా. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు. చిరు కూడా ఈ వేడుకకు ఎంతో ఉల్లాసంగా హాజరై ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఇంకోవైపు లేడీ అమితాబ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు ఈ వేడుకకు హాజరై సందడి చేసారు. అంతేకాదు ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిరంజీవిని పలకరించడం ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు ఈ ముగ్గురు ఒకే చోట కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ముగ్గురి అపూర్వ కలయికను చూసి సూపర్ స్టార్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు.