విజయ్ తో డేటింగ్.. సోషల్ మీడియాలో బయటపెట్టిన కీలక నటి

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా సౌత్ లోని అర్బన్ ఏరియాస్ లో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సాధారణ అభిమానులే కాదు.. సెలబ్రిటీల్లో కూడా విజయ్ అభిమానులు ఉన్నారు. రీసెంట్ గా అలాంటి ఒక సెలబ్రిటీ ఫ్యాన్ గురించి అందరికీ తెలిసింది.

విజయ్ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా మలయాళం వెర్షన్ ప్రమోషన్స్ కోసం కేరళ వెళ్ళడం జరిగింది. అక్కడ మలయాళం హీరోయిన్ సానుష విజయ్ ను కలవడం ఒక ఫోటో తీయించుకోవడం చకచకా జరిగిపోయాయి. సానుష ఆ ఫోటోను తన ఇన్స్టా ఖాతా పోస్ట్ చేసి “నా దగ్గర ఒకే ప్రశ్న ఉంది: మీరు నాతో డేట్ కు వస్తారా? .. అవును లవ్.. విజయ్ దేవరకొండ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. విజయ్ ను సానుష ఆ ప్రశ్న అడిగినట్టు.. విజయ్ ‘యస్’ అని చెప్పినట్టు అర్థం కదా. ఇక ఫోటోలో ఒక నిజమైన అభిమాని తరహాలో బ్రాడ్ స్మైల్ తో విజయ్ కు దగ్గరగా నిలుచుంది. విజయ్ కూడా ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ నిల్చున్నాడు.

మలయాళంలో దాదాపు ముప్పై సినిమాలలో నటించిన సానుష పలు తమిళ.. కన్నడ చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ ‘బంగారం’ లో ఒక చిన్నపాత్ర చేసింది. ‘జీనియస్’.. ‘జెర్సీ’ సినిమాల్లో కూడా నటించింది. ‘జెర్సీ’ లో యాక్టర్ నందుకు గర్ల్ ఫ్రెండ్ జర్నలిస్ట్ రమ్య పాత్రలో నటించింది.