విజయ్ ` వరల్డ్ ఫేమస్ లవర్ ` స్టోరీ లైన్ ఇదేనా..? అచ్చం రాం చరణ్ కథలాగే..?

విజ‌య్ దేవ‌ర‌కొండ – క్రాంతి మాధ‌వ్ సినిమాకి ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’ అనే టైటిల్ పెట్టారు. జ‌నంలోకి వెళ్ల‌డానికి కాస్త టైమ్ ప‌ట్టేట్టు ఉన్నా – క‌థ‌కి ఇదే యాప్ట్ అన్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల న‌మ్మ‌కం. అయితే.. ఈ టైటిల్ చూస్తుంటే జ‌నాల‌కు ‘ఆరెంజ్‌’ సినిమా గుర్తు రాక‌మాన‌దు. ఈసినిమాలో ‘ఐయామ్ వ‌ర‌ల్డ్ గ్రేటెస్ట్ ల‌వ‌ర్‌’ అంటుటాడు రామ్‌చ‌ర‌ణ్‌. త‌న పాత్ర కూడా అలానే ఉంటుంది.ఎవ‌రినీ ఎక్కువ కాలం ప్రేమించ‌డు.. కానీ ప్రేమిస్తే మాత్రం ది బెస్ట్ ఇచ్చేస్తాడు. అందులో హీరోకి చాలా ల‌వ్ స్టోరీలు ఉంటాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థ కూడా ఇంచుమించు ఇలాంటిదే. న‌లుగురు హీరోయిన్ల‌ని ఒకేసారి ప్రేమిస్తుంటాడు విజ‌య్‌. ప్ర‌తీ ఒక్క‌రికీ అత్యుత్త‌మ ప్రేమ పంచుతుంటాడు. చివ‌రికి ఎవ‌రిని త‌న జీవిత భాగ‌స్వామిగా మార్చుకున్నాడ‌న్న‌దే క‌థ‌.చూస్తుంటే విజ‌య్ సినిమాకి `ఆరెంజ్‌` ఫ్లేవ‌ర్ బాగా త‌గిలిన‌ట్టు క‌నిపిస్తోంది. కాక‌పోతే… ఆరెంజ్‌లో జెనీలియా మాత్ర‌మే నాయిక‌. ఇక్క‌డ న‌లుగురున్నారు. న‌లుగురితో నాలుగు ల‌వ్ స్టోరీలు న‌డుస్తాయి. ఆ ప్రేమ‌క‌థ‌లన్నీ విభిన్నంగా ఉంటాయ‌ని, ఒక్క ప్రేమ ఒక్కో కోణంలో సాగుతుంద‌ని తెలుస్తోంది. మ‌రి క్రాంతి మాధ‌వ్ ఈ క‌థ‌ల్ని ఎలా తీర్చిదిద్దాడో చూడాలి.