దటీజ్ కామ్రేడ్.. ఫాన్స్ కు సూపర్ మెస్సేజ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన స్పీచ్ లలో యువతను ఏ విధంగా ఆకట్టుకుంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే రీసెంట్ గా కౌసల్యా కృష్ణమూర్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా విజయ్ తన అభిమానులకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఇటీవల జరిగిన సర్వేలో 2020వ సంవత్సరం తరువాత హైదరాబద్ చాలా వరకు నీటి శాతం తగ్గే అవకాశం ఉన్నట్లు చెప్పిన విజయ్ అభిమానులు వాటర్ ని సేవ్ చేయాలనీ ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పాడు.

అలాగే ఒక్కసారి వరల్డ్ లో ఒక్కరోజు నీరు లేకపోతే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అందరూ ఒకసారి ఉహించుకోవాలని చెప్పాడు.ఇక పెట్రోల్ ని ఎలా అయితే సేవ్ చేసుకుంటూ వాడుతున్నామో వాటర్ ని కూడా అలానే వాడాలని చెప్పిన విజయ్ కౌసల్యా కృష్ణమూర్తి సినిమా చిత్ర యూనిట్ కి తన బెస్ట్ విషెస్ ని అందించారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజేంద్ర ప్రసాద్ – ఐశ్వర్య రాజేష్ – శివగకార్తికేయన్ ముఖ్య పాత్రల్లో నటించారు