విజయ్ పక్కన క్రేజీ బ్యూటీ.. వర్కౌట్ అవుతుందా..?

ప్రియా ప్రకాష్ వారియర్… ఒక్క‌ కన్నుగీటుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కేరళ కుట్టి. మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’(తెలుగులో ‘లవర్స్ డే’)తో హీరోయిన్‌గా పరిచయమైన ఈ వింక్ బ్యూటీ… ప్ర‌స్తుతం యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో రానున్న సినిమాతో తెలుగునాట కథానాయిక(సెకండ్ హీరోయిన్)గా తొలి అడుగులు వేస్తోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే… ఇప్పుడు మరో తెలుగు చిత్రంలో నాయికగా ఎంపికైనట్టు తెలుస్తోంది.ఆ వివరాల్లోకి వెళితే… యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ‘ఫైటర్’ అనే మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో… విజయ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్నాడు. 2020 జనవరి నుంచి పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో… విజయ్‌కు జోడీగా వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ను సెలెక్ట్ చేసిందట చిత్ర బృందం. పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌… 2020 వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్టు స‌మాచారం. కాగా… త్వరలోనే ప్రియా ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ప్రస్తుతం ప్రియ తెలుగుతో పాటు హిందీ(‘శ్రీదేవి బంగ్లా’), కన్నడ(‘విష్ణుప్రియ’) భాషల్లోనూ నాయికగా నటిస్తోంది.