ఎక్కడి నుండి ఎక్కడికి.. విజయ్ దెవరకొండ ఇంతలా పడిపోయాడా..?

గీత గోవిందం తర్వాత పలువురు స్టార్‌ డైరెక్టర్లు విజయ్‌ దేవరకొండని కాంటాక్ట్‌ చేసారు. అయితే వారితో వెంటనే సినిమా ఓకే చేసేసుకోకుండా మంచి కథ కుదిరితే తప్పకుండా చేద్దామని చెప్పాడు. పూరి జగన్నాథ్‌ తనతో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చేస్తానంటే ఖాళీ లేదంటూ తప్పుకున్నాడు.అలాంటి విజయ్‌ దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’ ఫ్లాప్‌ తర్వాత బాగా షేక్‌ అయ్యాడు. ఇప్పుడు తనకోసం స్టార్‌ డైరెక్టర్లు క్యూ కట్టరని తెలుసుకున్నాడు.

అందుకే పూరితో ఇమ్మీడియట్‌గా సినిమా ఓకే చేసుకున్నాడు. ఇంతకుముందయితే తాను ఎవరికి చేయమంటే వారికి పూరి సినిమా చేయాల్సి వచ్చేది.కానీ ఇప్పుడు పూరి టర్మ్స్‌కి తగ్గట్టు విజయ్‌ లొంగిపోయాడు. తను ఒప్పందం చేసుకున్న బ్యానర్లు వున్నా కానీ ఆ నిర్మాతలని ఈ చిత్రంలో ఇన్‌వాల్వ్‌ చేయించలేకపోయాడు. ఈ చిత్రం చేయాలంటే కనుక పూరీ కనక్ట్స్‌లోనే చేయాలని పూరి జగన్నాథ్‌, ఛార్మి కండిషన్‌ పెట్టడంతో అందుకు కూడా తల ఊపేసాడు.నిన్న మొన్నటి వరకు స్టార్‌ డైరెక్టర్ల దృష్టిలో వున్నవాడు కాస్తా ఇప్పుడు మరొకరి కండిషన్లకి తగ్గట్టు ఆడుతున్నాడు. పూరీ జగన్నాధ్‌తో సినిమా అంటే అయితే అటు లేదంటే ఇటు అన్నట్టుంటుందనేది అతనకీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ రిస్క్‌ తప్పదని ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసాడు.