విజయ్ తో మూవీకి జాహ్నవి అంత అడిగేసిందా..? షాక్ లో చార్మీ

పూరి రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ తో గొప్ప కమర్షియల్ సక్సస్ ను అందుకున్నాడు. చాలాకాలం తర్వాత పూరి కి ఒక హిట్ పడటంతో మళ్ళీ టాలీవుడ్ హీరోలందరు పూరి డైరెక్షన్ లో సినిమా చేయాలని క్యూ కడుతున్నారు. దాదాపు యంగ్ హీరోలందరు ఈ క్యూ లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ పూరి విజయ్ దేవరకొండతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. ఇక పూరి సినిమాలో హీరోయిన్ చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఒక్కసారి పూరి చెయ్యి పడితే ఆ హీరోయిన్ జాతకం మారిపోవాల్సిందే. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా కోసం హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు పూరి అండ్ ఛార్మి.ఇది పక్కన పెడితే.. మన టాలీవుడ్ లో శ్రీదేవి కూతురు ఎప్పటినుండో నటించాలనుకుంటుందన్న వార్తలు చాలాకాలంగా వస్తున్నాయి.

శ్రీదేవి చివరి రోజుల్లో టాలీవుడ్ లో నటించబోతుందని వార్తలు వచ్చాయి. బాహుబలిలో రమ్యకృష్ణ ప్లేస్ లో శ్రీదేవి నటించాల్సిఉంది. అయితే అసలు కారణాలు తెలియదు కానీ అతిలోకసుందరి ప్లేస్ లో రమ్యకృష్ణ ను తీసుకున్నారు జక్కన్న. ఆ తరువాత ఫోకస్ మొత్తం తన కూతురు జాహ్నవి కపూర్‌ మీది పడింది. ఈమెను టాలీవుడ్ లోకి తీసుకుని రావడానికి చాలామంది దర్శక, నిర్మాతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. అలానే పూరి కూడా ట్రై చేస్తున్నారు. అందుకే విజయ్ దేవరకొండ సినిమా కోసం ఆమెను తీసుకుంద్దాం అని ట్రై చేస్తున్నారు.ఈ ప్రయత్నం లో భాగంగా ఛార్మి రీసెంట్‌గా ముంబై వెళ్లి జాహ్నవి కపూర్‌ ని కలిసి కథ చెప్పిందట! అంతా ఓకే కానీ, జాహ్నవి తన రెమ్యూనరేషన్‌ చెప్పేసరికి ఛార్మికి నోట మాట రాలేదట! కొంతసేపు అలా షాక్ లోనే ఉందని తాజా సమాచారం.

ఎందుకంటే జాహ్నవి అక్షరాలా నాలుగు కోట్లు ఇస్తేనే మీ సినిమా చేస్తానని నిర్మొహమాటంగా చెప్పిందట. దాంతో ఛార్మి అలానే తిరిగి వచ్చేసిందని ఫిలిం నగర్ లో టాక్. మన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అని చెప్పుకునే సమంత కానీ నయనతార కానీ అంత రెమ్యునిరేషన్ ఇప్పటి వరకు డిమాండ్ చేయలేదు. అలాంటిది జాహ్నవి చెప్పడంతో షాక్ తిన్నారు. నాలుగు కోట్లు ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వడం కష్టమే. ఒకరకంగా చెప్పాలంటే ఈ రెమ్యునిరేషన్ తో ఒక చిన్న సినిమా తీసేయొచ్చు.