విజయ్ తో పూరీ ఫిక్స్.. ఈ రచ్చ మామూలుగా ఉండదు

పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నటించనున్నాడట.. అనే వార్త గత కొంత కాలంగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, జస్ట్‌ ప్రచారం మాత్రమే అనుకున్నారంతా. కానీ, ఇదే నిజం కానుంది. ఎట్టకేలకు మన రౌడీ స్టార్‌ పూరీకే కనెక్ట్‌ కావాల్సి వచ్చింది. ఈ విషయమై, లేటెస్ట్‌గా అధికారిక ప్రకటన కూడా వెలువడింది. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాని పూరీ జగన్నాధ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించనున్నారు. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ఇదిలా ఉంటే, ఇంకా నిప్పే లేకుండా ఆల్రెడీ పొగ కూడా వచ్చేసింది ఈ కాంబినేషన్‌పై. ఈ సినిమాలో హీరో పాత్రను చాలా విభిన్నంగా డిజైన్‌ చేశాడట పూరీ, హీరోకి నత్తి అట.. అంటూ అప్పుడే పొగ రాజేసేశారు. కాంబినేషన్‌ అయితే ఓకే అయిపోయింది. మరి క్యారెక్టర్‌ విషయమై వస్తున్న గాసిప్స్‌ నిజమో కాదో తెలియాలంటే ఇంకొంచెం టైం వేచి చూడాలి. ఇక విజయ్‌ దేవరకొండ ఇటీవల ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో నిరాశ పరిచాడు.పూరీ జగన్నాధ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఇస్మార్ట్‌ హిట్‌ కొట్టి, ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు. ఈ తరుణంలో ఈ కాంబినేషన్‌ అంటే అంచనాలు అప్పుడే మొదలైపోయాయి. విజయ్‌ దేవరకొండకున్న ఫాలోయింగ్‌ సంగతి తెలిసిందే. అందులోనూ, ఆయన రౌడీ ఆటిట్యూడ్‌.. పూరీకి ఇలాంటి హీరోలే ఇష్టం.

ఒకవేళ తన హీరో అలా లేకున్నా, తన సినిమా కోసం అలా మార్చేసుకుంటాడు పూరీ జగన్నాధ్‌. అలాంటిది నరనరాన ఆ తరహా ఆటిట్యూడ్‌ నిండిపోయి ఉన్న విజయ్‌ దేవరకొండతో పూరీ చేయబోయే మ్యాజిక్‌ ఎలా ఉండబోతుందో వేచి చూడాలిక.