‘వాల్మీకి’ ట్రైలర్.. వరుణ్ తేజ్ అదరగొట్టాడు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రీ టీజర్, టీజర్‌లు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.ఊహించినట్టుగానే వరుణ్ మాస్‌లుక్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిక్కీ జే మేయర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ ట్రైలర్‌కు హైలైట్.ఈ మధ్యకాలంలో ఇంటిల్లిపాది కూర్చొని చూసే సినిమాలు ఎక్కడ వస్తున్నాయి’

అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. వరుణ్ తేజ్ పాత్ర పేరు ‘గద్దలకొండ గణేష్’ అని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. అంతేకాక.. ఫ్లాష్ బ్యాక్‌లో వరుణ్ కనిపించే మరో లుక్‌ కూడా ఆకర్షణీయంగా ఉంది. దర్శకుడి పాత్రలో అధర్వ కూడా ఒదిగిపోయాడు. పూజా హెగ్డే, మృణాలిని రవిల గ్లామర్ కూడా ట్రైలర్‌కు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20వ తేదీన విడుదలకానుంది.