వితిక సలహాలను అస్సలు పట్టించుకోని వరుణ్ సందేశ్

‘బిగ్ బాస్ 3’ పోటీలో చివరి వరకు కొనసాగిన వరుణ్ సందేశ్ వితికలు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసారు. వాస్తవానికి వితిక ‘బిగ్ బాస్ 3’ షోలో వరుణ్ సందేశ్ తో కలిసి ఆ షోలో పాల్గొనే హౌస్ మేట్స్ మధ్య పోటీ పడాలని అనుకోలేదట.అయితే వరుణ్ సందేశ్ ఎదుటి వారితో వెంటనే కలవలేడనీ దీనికితోడు అతడికి ఓర్పు కూడ చాల తక్కువ అనీ ప్రపంచం అంటే ఏమిటో పూర్తిగా తెలియక పోవడంతో ఇలాంటి షోలలో తొందరగా మోసపోయి వెంటనే తిరిగి వచ్చేస్తాడుఅన్నభయంతో తాను వరుణ్ తో ‘బిగ్ బాస్’ షోలోకి వెళ్ళిన విషయాన్ని వితిక బయటపెట్టింది.

ఒక వ్యక్తిగా వరుణ్ చాల నిజాయితీ పరుడే అయినప్పటికీ ఆ వ్యక్తి రాణించాలి అంటే కేవలం నిజాయితీ మాత్రమే సరిపోదు అంటూ ఆమె వరుణ్ వ్యక్తిత్వం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఇదే సందర్భంలో ఆమె వరుణ్ దుబారా తనం గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది. వరుణ్ షూటింగ్ కు వెళ్ళేడప్పుడు ఇంట్లో ఏసీ ఆన్ చేసి వెళ్ళే అలవాటు ఉన్న వరుణ్ వింత అలవాట్ల గురించి చెపుతూ సాయంత్రం తాను షూటింగ్ నుండి ఇంటికి వచ్చే సరికి తన గది కూల్ గా ఉండాలి అన్న ఆలోచనతో ఉదయమే ఏసీ ఆన్ చేసి వెళ్ళిపోవడం వల్ల నెలకు 20 వేల కరెంటు బిల్లు వస్తున్న విషయాన్ని గ్రహించి ఆ విషయాన్ని వరుణ్ కు అర్ధం అయ్యేలా చెప్పడానికి తాను తాపత్రయాన్ని వివరించింది.వరుణ్ అతి మంచి తనం వల్ల సినిమాలలో వరస ఫెయిల్యూర్ లు వచ్చాయని అంటూ ఇప్పటికైనా వరుణ్ పరిస్థితులను గ్రహించి తెలివిగా మారితే బాగుండును అని కోరుకుంటున్న విషయాలను వివరించింది. ఇదే ఇంటర్వ్యూలో వరుణ్ మాట్లాడుతూ ‘బిగ్ బాస్’ క్రేజ్ తో తనకు మళ్ళీ క్రేజ్ వచ్చిన నేపధ్యంలో

తనకు తెలిసిన దర్శకులు అందరికి ఫోన్స్ చేసి అవకాశాలు అడగమని తన భార్య వితిక చెపుతున్నా తాను అలా అవకాశాల కోసం ఏ దర్శకుడుని అడగను అనీ అడిగితే ఇండస్ట్రీలో ఎవరు ఎవరికీ అవకాశాలు ఇవ్వరు అంటూ తన కెరియర్ ప్లానింగ్ లోపం వలన తనకు చాల చిన్న వయసులో వచ్చిన క్రేజ్ ను ఉపయోగించలేకపోయాను అంటూ వరుణ్ సందేశ్ ఇప్పుడు బాధ పడుతున్నాడు..