వామ్మో.. ఇంతలా పొగిడేసింది.. కాజల్ కామెంట్స్ కి ఫిదా అవుతున్న ప్రభాస్ ఫాన్స్

ప్రభాస్ హీరోగా, శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో ‘సాహో’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీకి ఎంత నెగిటివ్ టాక్ వచ్చినప్పిటికి సాహో ఇప్పటికే సుమారు రూ.500 కోట్లు వసూళ్ళు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇకపోతే ఇందులో బాడ్ బాయ్ అనే స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ భామ జాక్లిన్ అలరించింది.

మొదట ఆమె స్థానంలో కాజల్ ను అడిగారట కానీ రెమ్యునరేషన్ దగ్గరే అది ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా కాజల్ సాహో లో ప్రభాస్ పై హాట్ కామెంట్స్ చేసింది. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి అడగగా…‘‘ఐరన్‌మ్యాన్‌’, ‘హల్క్‌’ కలిస్తే ప్రభాస్‌’ అని కాజల్‌ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది