వరుణ్ `వాల్మీకి ` లో పూజను తీసుకోవడానికి అసలు కారణం ఇదే..?

కెరియర్ మొదట్లో వరుస ప్లాపులు చవిచూసిన పూజా హగ్దే..ఆ తర్వాత హరీష్ – బన్నీ కలయికలో వచ్చిన డీజే చిత్రంతో క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ..పూజా మాత్రం తన గ్లామర్ తో అందర్నీ కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అమ్మడిని టాప్ రేంజ్ కు తీసుకెళ్లాయి.ప్రస్తుతం ఈ భామ వాల్మీకి , అల వైకుంఠపురంలో , ప్రభాస్ మూవీ లో నటిస్తుంది. వాల్మీకి చిత్రాన్ని హరీష్ డైరెక్ట్ చేస్తుండగా ఈ మూవీ ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యంలో హరీష్ ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పూజా ను వాల్మీకి ట్లో తీసుకోవడానికి గల కారణాలు తెలిపాడు.DJ లో ఆమెని చాలా గ్లామరస్‌గా చూపించడం వల్ల కొంతమంది పొగిడారు కానీ మరికొంతమంది తిట్టుకున్నారు. అందుకే ఆమెకి ఈ సినిమాలో పూర్తిగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉన్న పాత్ర మాత్రమే రాసాను అని తెలిపాడు. ఇప్పటికే ట్రైలర్ లో పూజా ఎలా ఉందొ చూసాం..ఇక తెరపై ఎలా ఉంటుందో చూడాలి.