వాల్మీకిలో అలా చేస్తానని అస్సలు అనుకోలేదు.. వరుణ్ షాకింగ్ కామెంట్స్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ వాల్మీకి అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తు్న్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ తొలిసారి ఓ డిఫరెంట్ లుక్‌లో మనకు కనిపిస్తున్నాడు. పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ నటన మరో లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశారు.తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ ఈవెంట్‌లో వరుణ్ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు.తొలిసారి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని.. అదే విధంగా చాలా టెన్షన్‌గా ఉందని అన్నాడు.

ఇప్పటివరకు తానుచేయని పాత్రను ఈ సినిమాలో దర్శకుడు హరీష్ చూపించారని వరుణ్ తెలిపాడు. వాల్మీకి లాంటి మాస్ సినిమాలో నటించేందుకు తనకు మెగాస్టార్ చిరంజీవి స్పూర్తినిచ్చాడని తెలిపాడు.ఇక వాల్మీకి చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ చిత్రం జిగర్తండాకు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తోంది. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్‌ ప్రొడ్యూస్ చేసింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే 20వ తేదీ వరకు ఆగాల్సిందే.