ఆ ముగ్గురికే 100 కోట్లా..? RRR బడ్జెట్ ఎంతో మరి

భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ 2020 జూలైలో రిలీజ్ చేయడమే ధ్యేయంగా ఎస్.ఎస్.రాజమౌళి తథేక ఏకాగ్రతతో పని చేస్తున్న సంగతి తెలిసిందే. గుర్రం ముందుకే కానీ వెనక్కి చూడదు! అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం. ఒక్కో సీన్ ని ఉలి వేసి చెక్కడమే పనిగా పెట్టుకున్నారని తాజా సన్నివేశం చెబుతోంది. పండగలు పబ్బాలు వచ్చినా అసలు ఆయన బయటికి రావడం లేదు. కనీస ఉలికి పాటు అయినా లేదు. దసరా వెళ్లినా ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఏదో ఊహ వరకూ .. ఆర్.ఆర్.ఆర్ టైటిల్ ఇది అయితే ఎలా ఉంటుంది చూద్దాం.. అన్నట్టుగా.. రామ రౌద్ర రుషితం అన్న టైటిల్ ని రివీల్ చేశారు. కానీ ఆ టైటిల్ కి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

ఇక పనిలో పనిగా రాజమౌళికి ఆర్.ఆర్.ఆర్ హీరోలు ఒక్కొక్కరికి ఎంత పారితోషికం ముడుతోంది. అంటూ మరోసారి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమా కోసం ఒక్కొక్కరికి రామ్ చరణ్ – తారక్ లకు 30 కోట్లు పైగా ముడుతోందని ప్రచారమైంది. అయితే ఆ మొత్తాలు రకరకాల మార్గాల్లో ఆ ఇద్దరికీ అందుతాయి. అయితే లీగ్ లోకి వీళ్లకంటే జియాంట్ స్టార్ కూడా బరిలో దిగారు కాబట్టి ఆయన పారితోషికం అంతకుమించి అని తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో దేవగన్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందట. అందుకే ఆయన ఏకంగా 35కోట్ల పారితోషికం డిమాండ్ చేసారని వినిపిస్తోంది. ఆ పారితోషికానికి తగ్గట్టుగానే దేవగన్ పాత్ర పరిధి అంతే ఇదిగా ఉంటుందట. ఈ వివరాల్ని బట్టి కేవలం ముగ్గురు ప్రధాన స్టార్లకు ఇచ్చే పారితోషికాలే 100 కోట్లు. ఇక రాజమౌళి ప్యాకేజీ యెంత ఉంటుందో చెప్పాల్సిన పనేలేదు. అలాగే సపోర్టింగ్ క్యాస్టింగ్ పెద్దదే కాబట్టి వారికి భారీ రెమ్యునరేషన్ చెల్లించాల్సి ఉంటుంది.

దాదాపు 350కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాతలే క్లూ ఇస్తున్న సంగతి తెలిసిందే.దానయ్య సమర్పణలో తెరకెక్కుతున్న భారీయ పాన్ ఇండియా చిత్రమిది. ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో అలరించనుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా కనిపించనున్నారు. బల్గెరియా చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్ షెడ్యూల్ చేస్తున్నారు. త్వరలోనే టైటిల్ ప్రకటన ఉంటుందని ఇప్పటికే సిగ్నల్ అందింది.