ఉపాసన ఈ కొత్త కోణం ఎప్పుడైనా చూసారా..? నిజంగా షాకవ్వాల్సిందే..?

యూట్యూబ్ .. ఇప్పుడు టెక్నాలజీ అందించిన సౌలభ్యం.. దీని ద్వారా మనవాణిని మనం పబ్లిక్ లోకి తీసుకెళ్లొచ్చు.. ఇప్పుడు దాదాపు అందరు సెలబ్రెటీలు తమ సొంత యూట్యూబ్ ఛానళ్లను మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల కూడా సొంతగా ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు.ఈ ఉపాసన యూట్యూబ్ ఛానల్‌క దాదాపు లక్షా 30 వేల మంది సబ్ స్క్రయిబర్స్ ఉన్నారండోయ్.. 2017 సెప్టెంబర్ లో ప్రారంభించిన ఈ ఛానల్ కు ఇప్పటి వరకూ కోటి కి పైగా వ్యూస్ వచ్చాయి. ఉపాసన.. రామ్ చరణ్ భార్యగానే కాదు, అపోలో లైఫ్ ఎండీగానూ ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతే కాదు.. ఆమె ఓవైపు ఓ పెద్ద గ్రూపు ఆసుపత్రులకు ఎండీగా ఉంటూనే తన మనసుకు నచ్చిన పని చేస్తున్నారు.

అదే ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం..అవును ఆమె తన పేరుతోనే యూట్యూబ్ ఛానలను నిర్వహిస్తున్నారు. అదే ఉపాసన కామినేని కొణిదెల యూట్యూబ్ ఛానల్.. ఈ ఛానల్ ద్వారా అందం, ఆరోగ్యం, మెరుగైన లైఫ్ స్టయిల్ టెక్నిక్స్ తన అభిమానులతో పంచుకుంటున్నారు. వంటింటి చిట్కాలు కూడా అందిస్తారు. కేవలం హెల్త్ టిప్స్ మాత్రమే కాదు.. తన ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు కూడా పంచుకుంటారు.ఉపాసన తన ఛానల్ ద్వారా మెరుగైన జీవనశైలి కోసం మానసిక ఆరోగ్యం , శారీరక ఆరోగ్యం రెంటినీ మెరుగుపర్చుకునే అంశాల్లో వీక్షకులకు విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు.కొన్నిసార్లు ఈ విషయాల్ని పోషకాహార నిపుణులూ, సెలెబ్రిటీ చెఫ్ లు, ఫిట్నెస్ టైనర్లతోనే చెప్పిస్తారు. చిరంజీవి, సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్, సమంతా, పీవీ సింధు… ఇలాచాలామంది ప్రముఖుల జీవనశైలి గురించి ఆమె స్వయంగా ఇంటర్వ్యూ చేశారు కూడా.