ఉన్నపలంగా బిగ్ బాస్ నుండి అలీ రెజా ఎలినేట్ అవ్వడానికి అతడే కారణమా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో అనుకున్నదానికంటే కూడా రచ్చ కాస్త ఎక్కువగానే జరుగుతుంది. నిర్వాహకులు అనుకున్నదానికంటే కూడా ఈ ఇంటి సభ్యులు కాస్త ఎక్కువగా రక్తి కట్టిస్తున్నారు. కాగా గత వారంలో మాత్రం ఎవరు కూడా ఊహించని ఒక అనూహ్యమైన సంఘటన ఎదురైందని చెప్పాలి. అప్పటివరకు కూడా ఇంటిలో ఒక మంచి పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇంటి సభ్యుడు అలీ రెజా, ఒక్కసారిగా ఎవరు కూడా ఊహించని విధంగా ఎలిమినెట్ అయ్యారు.

కాగా అలీ ఎలిమినేట్ అవడంతో అందరు కూడా చాలా నిరాశకు గురయ్యారు. మరికొందరు మాత్రం ఇప్పటికి కూడా ఏడుస్తున్నారు. అయితే ఎలిమినేషన్ కి కారణం లేకపోలేదు. తన కోపమే తన శత్రువు అనే నానుడి కారణంగానే అలీ ఎలిమినేషన్ జరిగినదని అందరు కూడా అనుకుంటున్నారు. అయితే ఈసారి ఈ ఇంటిలో మాత్రం అలీ అందరిముందు చాలా కోపాన్ని ప్రదర్శించేవాడని అందరు కూడా చెబుతున్నారు. దానికి తోడు తన కోపంతో అలీ చెలరేగిపోయాడు.

కాగా తన కోపం కారణంగా అలీ ని అందరు కూడా బిగ్ బాస్ ఇంటికి అర్జున్ రెడ్డి అని పిలుచుకునే వారు. కాగా ఆ సినిమాలో విజయ్ దేవరకొండా లాగ అలికి కూడా కోపం చాలా ఎక్కువగా ఉండేదని అనుకునే తనని నిర్వాహకులు ఎలిమినేట్ చేశారని అందరు కూడా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఈ ఇంటిలో మాత్రం అతనే టఫ్ కంటెస్టెంట్ అని చెప్పాలి. కాగా అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అలీ ని ఎలిమినేట్ చేశారు కానీ, ఇక ముందు అలీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అని అందరు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు.