ఉదయ్ కిరణ్ పై డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు..

ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్లో దూసుకొచ్చిన యువ కెరటం. టాప్ ఫోర్ గా చిరు బాలయ్య, నాగ్, వెంకీ ఏలుతున్న రోజులవి. కొత్త హీరో రావాలంటే భయపడే స్టార్ డం వారి సొంతం. అటువంటి టైంలో నూనూగు మీసాల నూతన యవ్వనంతో వెండి తేర మీదకు చిత్రం సినిమాతో వచ్చి నిజంగా చిత్రమే చేశాడు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ చూసిన సక్సెస్ లైఫ్ ఏ యంగ్ హీరోకు అప్పటికీ ఇప్పటికీ రాలేదు. వరసగా హిట్ల మీడ హిట్లు కొట్టి టాప్ హీరోలనే బ్యాక్ బెంచ్ లోకి తెచ్చేశాడు. ఉదయ్ కిరణ్ అంటే అంతా పడిచచ్చేవారంటే అతిశయోక్తి కాదు.

అటువంటి ఉదయ్ కిరణ్ మొదటి పెళ్ళి ఆగింది. ఇక ఆయన కోరుకున్న అమ్మాయితో అన్నవరంలో పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యారని అంతా భావించిన వేళ హఠాత్తుగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని అందరినీ వదిలి వెళ్ళిపోయాడు. నిజంగా ఇదొక ట్రాజడీ.ఉదయ కిరణ్ జీవితంపై ఆయన్ని పరిచయం చేసిన డైరెక్టర్ తేజ బయోపిక్ తీస్తరని అప్పట్లో వినిపించింది. తాజాగా దీనిపైన తేజ స్పందించారు . తేజ మాట్లాడుతూ ” ఉదయ్ కిరణ్ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు .. కానీ అతని మీదా బయోపిక్ తీసి ఏం లాభం .. ఇప్పుడు ఆయనపై సినిమా తీసి నేను డబ్బులు సంపాదించుకోవాలా ? అనే ఆలోచన వచ్చింది.

అందుకే ఆ సినిమాని తీయలేదని తేజ చెప్పుకొచ్చారు . ఉదయ్ కిరణ్ పై సినిమా తీస్తే ఇప్పుడు వచ్చే యంగ్ హీరోలకు అది ఓక పాఠం అవుతుంది . సినిమా చూసే వాళ్ళకి పాఠం చెప్పకూడదు . వినోదం మాత్రం ఇవ్వాలని తేజ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఉదయ్ కిరణ్ ఓ హిస్టరీ. ఓ మిస్టరీ కూడా.