టాలివుడ్ లో ఎప్పటికి ఎవర్ గ్రీన్ మూవి ఇదే..?

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టించిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్. ఈ చిత్రం రొమ్యాంటిక్ ఫ్యామిలి కామిడి ఎంటర్‌టైనర్ చిత్రం. ఇందులో వెంకటేష్, ఆర్తి అగర్వాల్, ఆషా సైని, ప్రకాష్ రాజ్. చంద్ర మోహన్, సుధా, సునిల్, మల్లికార్జున, బాబు మోహన్, హేమ, పృద్వి, బ్రహ్మనందం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కె. విజమ్ భాస్కర్ దర్శకత్వం వ‌హించారు. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ డైలాగుల‌ను అందించారు. త్రివిక్ర‌మ్ డైలాగ్‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న ప్ర‌తీ డైలాగ్‌లో ఓ పంచ్ రెఢీగా ఉంటుంది. ఈ చిత్రం అప్ప‌ట్లో మంచి హిట్ అయింద‌ని చెప్పాలి.

ఈ చిత్ర నిర్మాత శ్రవంతి రవి కిశోర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కోటి స్వరాల‌ను స‌మ‌కూర్చారు. ఈ చిత్రం ఫుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది. ఇందులో ఉండే ప్ర‌తి డైలాగ్ ఇప్ప‌టికి అంద‌రూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇందులో సునీల్ పాత్ర పేరు బంతి. సునీల్ వెంక‌టేష్ మ‌ధ్య వచ్చే ప్ర‌తి స‌న్నివేశం చాలా అద్భుతంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. అలాగే వెంక‌టేష్‌, ఆర్తిల మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సీన్స్ అలాగే పంచ్‌డైలాగ్స్ అద్భుత‌మ‌ని చెప్పాలి. ఇక సినిమాలో బ్ర‌హ్మానందం ఎంట‌ర్ అయ్యాక వ‌చ్చే డైలాగులు మ‌రింత అద్భుత‌మ‌ని చెప్పాలి. ఒక ప్ర‌కాష్‌రాజ్ చెప్పే అమ్మ మీద క‌విత సినిమాకే పెద్ద హైలెట్ అని చెప్పాలి. అలాగే ఆర్తి క‌ళ్ళు చూస్తూ వెంక‌టేష్ క‌ళ్ళ‌ను డ్రా చేసే స‌న్నివేశం కూడా చాలా బావుంటుంది.

ఇందులో ఎం.ఎస్ నారాయ‌ణ తాగుబోతు పాత్ర‌లో చాలా బాగా న‌టించారు. అదే విధంగా వెంక‌టేష్ ప్ర‌కాష్‌రాజ్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కూడా అదిరిపోతాయి అని చెప్పాలి. ఇక హాస్యాన్ని పండించ‌డంలో వెంక‌టేష్‌ది ఒక ప్ర‌త్యేక‌మైన శైలి ఉంటుంది. ఇందులో వెంక‌టేష్ భోజ‌నం ద‌గ్గ‌ర కూర్చున్న‌ప్పుడు వ‌చ్చే డైలాగ్ నా పూజ మీ అంద‌రికి చాలా కొత్త‌గా ఉంద‌నుకుంటా అంటాడు..దానికి ఎం.ఎస్ నారాయ‌ణ కొత్త‌గా కాదు చెత్త‌గా ఉంది అంటాడు. అలాంటి డైలాగులు సినిమాలో మ‌రెన్నో ఉన్నాయని చెప్పాలి.