త్రివిక్రమ్ జీవితంలో అదే పెద్ద మాయని మచ్చనా..?

టాలీవుడ్ లో తన ఆకట్టుకునే పదునైన పంచ్ డైలాగ్స్ తో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్, కెరీర్ తొలి నాళ్లలో వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో కథ మరియు మాటల రచయితగా పరిచయం అవడం జరిగింది. త్రివిక్రమ్ తొలి సారి కథ, మాటలు అందించిన ఆ సినిమా మంచి సక్సెస్ సాధించి, ఆ తరువాత ఆయనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. అనంతరం చిరునవ్వుతో, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్ సినిమాలకు కూడా ఆయన రచయితగా పని చేసారు. ఇక ఆ తరువాత తరుణ్ హీరోగా శ్రీయ హీరోయిన్ గా స్రవంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన నువ్వే నువ్వే సినిమా ద్వారా దర్శకుడిగా మారారు త్రివిక్రమ్. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ హిట్ కొట్టిన త్రివిక్రమ్,

ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో అతడు తీసి రెండవ విజయాన్ని, అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా సినిమా తీసి మూడవ విజయాన్ని కూడా సొంతం చేసుకున్నారు. వాటి తరువాత అల్లు అర్జున్ తో జులాయి, పవన్ తో అత్తారింటికి దారేది, నితిన్ తో ఆఆ, ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక మహేష్ తో ఖలేజా, అలానే ఇటీవల పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి సినిమాలు త్రివిక్రమ్ కెరీర్ లో ఫ్లాప్స్ గా నిలిచాయి. అయితే అజ్ఞాతవాసి సినిమా టాలీవుడ్ అతి పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో పాటు కెరీర్ పరంగా త్రివిక్రమ్ కు ఎన్నడూ లేనంతగా కొంత అపఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆ సినిమా రిలీజ్ తరువాత, అంతకముందు ఫ్రెంచ్ భాషలో తెరకెక్కిన లార్గో వించ్ అనే సినిమాను పూర్తిగా మక్కికి మక్కి దించి త్రివిక్రమ్ అజ్ఞాతవాసి తీశారనే విమర్శలు విపరీతంగా వెల్లువెత్తాయి.

అయితే అంతటితో ఆగకుండా, ఏకంగా లార్గో వించ్ సినిమా దర్శకుడు సైతం తమ సినిమాను కాపీ చేసి తెలుగులో అజ్ఞాతవాసి సినిమా తీశారంటూ ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అయితే నిజానికి త్రివిక్రమ్, లార్గో వించ్ ని కాపీ కొట్టి తన సినిమాను తీసారా లేదా అనే విషయాన్ని అటుంచితే, ఆ ఘటనల వలన త్రివిక్రమ్ కు కొంత నెగటివ్ ఇమేజ్ వచ్చింది. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత సూపర్ హిట్ తో మళ్ళి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు త్రివిక్రమ్. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఆయన తెరకెక్కిస్తున్న అలవైకుంఠపురములో సినిమా, జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది……!!