ఇందులో నిజమెంత.. సమంత అక్కినేని బ్రేకప్

అక్కినేని కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత బ్రేకప్ చెప్పనుందట. అదీ కూడా చిన్ని బ్రేకప్ మాత్రమే. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే, మరోవైపు యువహీరో నాగచైతన్య భార్యగా తన పాత్రను పోషిస్తోంది. ముఖ్యంగా, నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత వరుస సినిమాలు చేస్తూ, వరుస హిట్స్ సాధిస్తూ దూసుకెళుతోంది. ఇటీవ‌ల “ఓ బేబి” చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన స‌మంత ప్ర‌స్తుతం “96” రీమేక్ చిత్రంలో న‌టిస్తుంది. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వ‌ర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో యువ హీరో శర్వానంద్ కెమెరామెన్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. మ‌రోవైపు ‘ఫ్యామిలీమెన్-2’ వెబ్‌సిరీస్‌లోనూ సమంత నటిస్తోంది. ఇవి పూర్తైన త‌ర్వాత‌ కొద్ది రోజుల పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చి మాతృత్వం పొందేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటుంద‌ని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మొత్తంమీద సమంత త్వరలోనే తల్లి అయ్యేందుకు సినిమాలకు చిన్నపాటి బ్రేక్ ఇవ్వనుందన్నమాట.