అందుకే త్రివిక్రమ్ గురుజీ అయ్యారు.

సినీ రంగంలో విజ‌యాలు ఎవ‌రికైనా వ‌స్తాయి. కానీ గౌర‌వం అంద‌రికీ రాదు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ లాంటి కొద్ది మంది మాత్ర‌మే అది సంపాదిస్తారు. ర‌చ‌యిత‌గా త్రివిక్ర‌మ్ సంపాదించుకున్న పేరు ప్ర‌ఖ్యాతుల గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ద‌ర్శ‌కుడిగా కూడా ఒక‌ప్పుడు త్రివిక్ర‌మ్ స్థాయే వేరుగా ఉండేది. కానీ గ‌త కొన్నేళ్ల‌లో త‌న స్థాయికి త‌గ‌ని కొన్ని సినిమాలు తీసి గౌర‌వాన్ని త‌గ్గించుకున్నాడు మాట‌ల మాంత్రికుడు.ఐతే అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ త‌న పూర్వ‌పు స్థాయిని అందుకున్నాడు. ఇందులో ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ టాప్ ఫామ్‌లో క‌నిపించాడు. ఈ సినిమా క్లైమాక్స్‌కు ముందు వ‌చ్చే ఫైట్ త్రివిక్ర‌మ్ ఎలాంటి ఫాంలో ఉన్నాడో చెప్ప‌డానికి ఒక ఉదాహ‌ర‌ణ‌.సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు అంటూ సాగే శ్రీకాకుళం జాన‌ప‌దం బ్యాగ్రౌండ్లో వ‌స్తుండ‌గా.. క్లైమాక్స్ ఫైట్ పెట్ట‌డం త్రివిక్ర‌మ్‌కే చెల్లింది.

 

గ‌తంలోనూ కొన్ని సినిమాల్లో పాట‌ల బ్యాక్ డ్రాప్‌లో ఫైట్లు వ‌చ్చాయి కానీ.. త్రివిక్ర‌మ్ మాత్రం ఈ ఫైట్‌ను చాలా ఎఫెక్టివ్‌గా తీశాడు.ఫైట్లు రొటీన్‌గా తీస్తార‌ని పేరున్న‌ రామ్ ల‌క్ష్మ‌ణ్ ఈ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను మాత్రం భ‌లేగా చేశారు.ఒక పొయెటిక్ ఫీలింగ్ క‌లుగుతుంది ఈ ఫైట్ చూస్తే. త్రివిక్ర‌మ్ నుంచి ఆయ‌న అభిమానులు ఆశించేది ఇలాంటి మ్యాజిక్కే. ఈ సంద‌ర్భానికి అలాంటి పాట‌ను రాయించాల‌ని.. దాని బ్యాక్ డ్రాప్‌లో ఫైట్‌ను న‌డిపించాల‌ని త్రివిక్ర‌మ్ ఆలోచించ‌డ‌మే గ్రేట్. ఉత్త‌రాంధ్ర వాళ్ల‌కు ఈ సాంగ్ ఫైట్ భ‌లే కిక్కిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ పాట‌ను విజ‌య్ కుమార్ అనేఉత్త‌రాంధ్ర‌ లిరిసిస్టే రాశాడు.