సూపర్ స్టార్ ని సైతం పక్కన పెట్టేసిన పల్లవి

మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న భామ సాయి పల్లవి. ఆ సినిమాలో అమ్మడికి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. ఇక తెలుగులో ఫిదా సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవికి తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఎంతపెద్ద స్టార్ ఛాన్స్ అయినా సరే తనకు పాత్ర నచ్చితేనే చేస్తా అని కచ్చితంగా చెబుతుంది సాయి పల్లవి. అందుకే సూపర్ హిట్ సినిమాలను సైతం మిస్ చేసుకుంటుంది. అలా సూపర్ స్టార్ ,మహేష్ సూపర్ ఛాన్స్ ను జారవిడిచింది సాయి పల్లవి.

ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. అసలైతే డైరక్టర్ అనీల్ రావిపూడి మహేష్ పక్కన సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నాడట. దిల్ రాజు ద్వారా సాయి పల్లవికి కథ చెప్పారట.. కానీ అందులో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేదని ఆమె ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. స్టార్ సినిమాల్లో ఛాన్స్ వస్తే ఎగిరిగంతేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలి.. అది అందరు చేసే పని.. కానీ ఇక్కడ భానుమతి ఒక్కతే పీస్.. హైబ్రిడ్ పిల్ల కదా అందుకే మహేష్ ఛాన్స్ సైతం కాదనేసింది.

సాయి పల్లవి సినిమాల సెలక్షన్స్ చాలావెరైటీగా ఉంటుంది. ప్రస్తుతం రానాతో విరాటపర్వం సినిమా చేస్తున్న సాయి పల్లవి ఈ సినిమాతో పాటుగా నాగ చైతన్యతో లవ్ స్టోరీ చేస్తుంది. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న ఈ లవ్ స్టోరీపై సాయి పల్లవి చాలా హోప్స్ పెట్టుకుంది. ఇక ఇదే కాకుండా శర్వానంద్ తో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సాయి పల్లవి.