రష్మీ, సుధీర్ మధ్య ఉన్నది అదే..? జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్..

ప్రస్తుతం ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతూ మంచి వీక్షకధారణతో పాటు అద్భుతమైన రేటింగ్స్ తో దూసుకెళ్తున్న జబర్దస్త్ షో ద్వారా, నటుడిగా ఎంతో పాపులరైన సుడిగాలి సుధీర్ మరియు ఆ షో యాంకర్ రష్మీ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నాళ్లుగా వార్తలు పుకారవుతూనే ఉన్నాయి. ఆ తరువాత వారిద్దరూ కలిసి అదే ఛానల్ లో ఢీ జోడి అనే ప్రోగ్రాం కి కూడా వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తుండడంతో ఆ రూమర్లు మరింతగా పెరిగాయి. నిజానికి కొన్నాళ్ల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా అహనా పెళ్ళంట అనే ప్రత్యేక స్కిట్ లో భాగంగా సుధీర్ మరియు రష్మీ ల పెళ్లి జరుగుతుంది. అయితే ఆ స్కిట్ లో కథ పరంగా సుధీర్ కి కల రావడం, ఆ కలలో రష్మీతో పెళ్లి జరగడం, అందుకు అతను విపరీతంగా మురిసిపోవడం జరుగుతుంది.

ఇక అప్పటినుండి వారిద్దరిపై ఈ రూమర్లు ప్రచారం అవడం మొదలయ్యాయి. అయితే మా ఇద్దరి మధ్య మంచి స్నేహం తప్ప మీరు అనుకునే విధంగా ఏమి లేదు అంటూ వారిద్దరూ ఎప్పటికపుడు చెప్తూ వస్తున్నప్పటికీ, ఈ రూమర్స్ కి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. ఇక వీరిద్దరి విషయమై నిన్న ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో జబర్దస్త్ నటుడు అప్పారావు మాట్లాడుతూ, మాలో ఎవరైనా ఏదైనా పని మీద ప్రక్క ఊళ్లకు వెళితే కనుక, ముందుగా అక్కడి వారు తమను అడిగే మొదటి ప్రశ్న సుధీర్ కి రష్మీ కి పెళ్లి ఎపుడు అనే అంటున్నారు అప్పారావు. ఒకప్పుడు సంక్రాంతి సందర్భంగా వేసిన ఒక సరదా స్కిట్ లో భాగంగా జరిగిన వారిద్దరి పెళ్లిని అడ్డంపెట్టుకుని, నిజంగానే వారిద్దరి మధ్య సంబంధం ఉంది, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ మీడియా వరకు విపరీతంగా వార్తలు రాసేస్తున్నారని అన్నారు.

నిజానికి తమ జబర్దస్త్ టీమ్ మెంబెర్స్ అందరితోనూ రష్మీ గారికి, అలానే అనసూయ గారికి మంచి అనుబంధం ఉందని, వారు చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతిఒక్క నటుడిని ఎంతో సాదరంగా పలకరిస్తారని అన్నారు. ఇక రష్మీ గారికి సుధీర్ గురించి పూర్తిగా తెలుసునని, వారిద్దరి మధ్య మంచి స్నేహితులుగా అనుబంధం ఉందని, దానినే అందరూ తప్పుగా భావించి రాతలు రాస్తున్నారని అన్నారు. ఒకవేళ మీడియాలో ప్రచారం అవుతున్నట్లు సుధీర్, రష్మీ మధ్య అటువంటి సంబంధమే ఉంటె తప్పకుండా బయటకు వస్తుంది షాకింగ్ గా సమాధానం ఇచ్చారు. అయితే మా అందరికి తెలిసినంతవరకూ అటువంటిది ఏది లేదని మాత్రం గట్టిగా చెప్తున్నాను అన్నారు. కాబట్టి ఇకనైనా మీడియా మిత్రులు వారిద్దరి పెళ్లి గురించి తప్పుడు వార్తలు రాయకండి అంటూ ఆయన అభ్యర్ధించారు…..!!