సరిలేరు చెయడానికి అసలు రీజన్ ఇదే..

మహేశ్ తో సినిమాలు చేయాలనే దర్శకులు, నిర్మాతలకు కూడా కొదవ లేదు. ఆయన డేట్స్ కోసం లైన్లు ఉంటాయి. మహేశ్ తో సినిమా చేయాలనే దర్శకులు కథలు పట్టుకుని తిరుగుతూంటారానేది నిజం. కానీ.. మహేశ్ ఎవరితో సినిమా చేస్తాడో ఆయన రివీల్ చేసే వరకూ తెలీదు. కానీ మహేశ్ పై ఓ అపవాదు మాత్రం ఉంది. సినిమాలు కమిట్ అయ్యే విషయంలో ఆయన తీరు పలు మార్లు వివాదాస్పదం అయింది కూడా. దీనికి నిన్న సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సమాధానం చెప్పకనే చెప్పాడని చెప్పాలి.

 

మహేశ్ మాట్లాడుతూ ఈ సినిమా తానెందుకు చేయాల్సి వచ్చిందో తన స్పీచ్ లో ఫ్లోలో చెప్పేశాడు. ఈ సినిమా కథ నచ్చబట్టే చేసినట్టు చెప్పుకొచ్చాడు. కారణమేంటంటే.. సుకుమార్ తన రంగస్థలం తర్వాత మహేశ్ తో సినిమా చేయాలని చాన్నాళ్లు వెయిట్ చేశాడు. మహేశ్ కూడా సుకుమార్ తో చాల సిట్టింగ్స్ లో కూర్చున్నాడని వార్తలు వచ్చాయి. కానీ మహర్షి రిలీజ్ కాగానే అనిల్ రావిపూడి కథను పట్టాలెక్కించేశాడు. ఇది సుకుమార్ కు ఊహించని పరిణామం అయింది. అనిల్ అప్పటికే ఎఫ్2 తో భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఉన్నాడు. వెంటనే అనిల్ తో సినిమా కమిట్ అయ్యేప్పటికి మహేశ్ పై అనేక విమర్శలు వచ్చాయి.మహేశ్ హిట్లకే ప్రాధాన్యం ఇస్తాడని హిట్ ఇచ్చిన దర్శకుడితోనే సినిమాలు చేస్తాడని విమర్శలు ఉన్నాయి.

 

ఆ మధ్య పూరి జగన్నాధ్ కూడా ఇదే చెప్పాడు. హిట్లుంటేనే మహేశ్ తనను పలకరిస్తాడని ఓపెన్ గా సమాధానం చెప్పాడు. సుక్కు హిట్ ఇచ్చి ఉన్నా అనిల్ కమర్షియల్ కధకు ఓకే చెప్పడం సుకుమార్ ను వెయిట్ చేయించడంతో మహేశ్ పై విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాలన్నింటికి నిన్న మహేశ్ సమాధానం చెప్పినట్టయిందనే అనుకోవాలి.