నాగబాబు ఇలా సన్నబడటానికి అసలు కారణం అదే..? బయటపెట్టిన గెటప్ శ్రీను

గెటప్ శ్రీను నాగబాబు గురించి కీలక విషయాలు బయటపెట్టాడు. అదీ.. ఆయన హెల్త్ సీక్రెట్స్ గురించి కావడం గమనార్హం. నాగబాబు 41 రోజుల డైట్‌ను ఫాలో అవుతున్నారని, దాంతో ఆయన సన్నబడ్డారని వెల్లడించాడు. జబర్దస్త్‌లో మెగా బ్రదర్ నాగబాబు అంటే ఆర్టిస్టులందరికీ అభిమానం. ఆయన్ను ప్రత్యేకంగా గౌరవిస్తుంటారు. సుడిగాలి సుధీర్ అయితే ఏకంగా డాడీ అంటూ తన ప్రేమను కురిపిస్తాడు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్, రాకెట్ రాఘవ.. ఇలా ప్రతీ ఒక్కరు ఆయనంటే పడిచస్తారు.

అయితే.. గెటప్ శ్రీను నాగబాబు గురించి కీలక విషయాలు బయటపెట్టాడు. అదీ.. ఆయన హెల్త్ సీక్రెట్స్ గురించి కావడం గమనార్హం. నాగబాబు 41 రోజుల డైట్‌ను ఫాలో అవుతున్నారని, దాంతో ఆయన సన్నబడ్డారని వెల్లడించాడు. ఆయన ఒక్కరే ఫాలో అవడం కాకుండా, జబర్దస్త్ ఆర్టిస్టులందరూ ఫాలో కావాలని ఆదేశించినట్లు తెలిపాడు. ఆ డైట్ ఆరోగ్యానికి మంచిదని, దానివల్ల భవిష్యత్తులో అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని నాగబాబు చెప్పినట్లు అన్నాడు.

ఆ డైట్ ఫాలో అయ్యి తాను 5 కిలోలు తగ్గానని, మిగతా ఆర్టిస్టులు కూడా ఆహార నియమావళి పాటిస్తున్నారని గెటప్ శ్రీను వెల్లడించాడు. ఆరోగ్యం బాగుంటే.. కెరీర్ బాగుంటుందని, దాంతో అవకాశాలు వస్తాయని, డబ్బు, పరపతి పెరుగుతుందని నాగబాబు చెబుతూ ఉండేవారని ఆయన సీక్రెట్స్ బయటపెట్టాడు.