మెగా `సైరా`లో క్లైమాక్స్ ఇలాగే ఉండబోతుందా..?

స్వాతంత్య్ర సమరయోధులంతా చివరికి దేశం కోసం ప్రాణాలర్పించడమే. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కూడా క్లైమాక్స్‌ అదే అవుతుంది కదా. ఈ క్లైమాక్స్‌ సీన్‌ని చాలా పవర్‌ఫుల్‌గా రచించి, తెరకెక్కించాడట సురేందర్‌ రెడ్డి. క్లైమాక్స్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశం కోసం తనువు చాలిస్తూ, చెప్పే డైలాగులు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోయేలా ఉంటాయట. ధియేటర్‌ నుండి బయటికి వచ్చినా కూడా అవే మాటలు వెంటాడుతుంటాయట.

ఆ రేంజ్‌లో డైలాగులు రచించారట. దేశం నుండి బ్రిటీష్‌ వారిని పారద్రోలే క్రమంలో ఆయన నోటి వెంట వచ్చిన ఆ డైలాగులు ‘ఇవీ..’ అంటూ దేశభక్తిని చాటేలా కొన్ని డైలాగులు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఆ డైలాగులు అలా వింటేనే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇక సీన్‌లో ఆ ఫోర్స్‌లో చిరంజీవి నోటి వెంట వచ్చే ఆ డైలాగ్‌ ఎంత ఇంపాక్ట్‌ చూపిస్తుందో కదా. ఇదిలా ఉంటే, ఇప్పటికే ‘సైరా’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రికార్డులు సృష్టిస్తోంది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ ‘సైరా’ దక్షిణాదిన మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

దాదాపు 40 కోట్లు వ్యత్యించి అమెజాన్‌ ప్రైమ్‌ వారు ‘సైరా’ హక్కుల్ని కొనుగోలు చేశారట. నైజాం, సీడెడ్‌, ఓవర్సీస్‌.. ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా, ‘సైరా’ కనీ వినీ ఎరుగని రీతిలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుగుతోంది. తెలుగుతో పాటు, దక్షిణాది భాషలన్నింట్లోనూ ‘సైరా’ విడుదలవుతోంది. బాలీవుడ్‌లో ‘సైరా’పై విపరీతమైన అంచనాలున్నాయి.