అతి తక్కువ ధరకే 4 కెమేరా ఫోన్.. ఫీచర్స్ చూస్తే షాకవ్వాల్సిందే..!

కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఇందులో 4 కెమెరాలు, పెద్ద స్క్రీన్, భారీ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ఇన్‌ఫినిక్స్ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. దీని పేరు ఇన్‌ఫినిక్స్ హాట్ 7. ఈ ఫోన్‌లో ముందు భాగం, వెనుక భాగంలో డ్యూయెల్ రియర్ కెమెరాలు ఉంటాయి.

కంపెనీ ఇన్ఫినిక్స్ హాట్ 7 ప్రో ఫోన్‌ను లాంచ్ చేసిన నెల రోజుల తర్వాత ఇన్‌ఫినిక్స్ హాట్ 7 ఫోన్‌ను ఆవిష్కరించింది. అయితే రెండు ఫోన్లలోనూ ప్రత్యేకతలు భిన్నంగా ఉన్నాయి. ధర కూడా వేరుగానే ఉంది.ఇన్‌ఫినిక్స్ హాట్ 7 స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999. జూలై 15 నుంచి ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఇది కేవలం 64 జీబీ మెమరీ, 4 జీబీ ర్యామ్ వేరియంట్ రూపంలో మాత్రమే లభ్యమౌతుంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ముందు, వెనుక భాగాల్లో డ్యూయెల్ కెమెరా వ్యవస్థ ఉంటుంది. కంపెనీ ముందు భాగంలో 13 ఎంపీ+ 2 ఎంపీ డ్యూయెల్ కెమెరాను అమర్చింది. వెనుక భాగంలోనూ ఇదే కెమెరా వ్యవస్థ ఉంటుంది.

ఫోన్‌లో అలాగే 6.19 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ హీలియో పీ25 ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.