తారక్ కోసం అదిరిపోయే స్క్రిప్ట్.. త్రివిక్రం ఫోన్ చేస్తే ఏం చెప్పాడో తెలుసా..?

‘అరవింద సమేత’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పని చేయడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. వీరిద్దరి కలయికలో అసలు సినిమాయే రాదు అన్న రీతిలో వీరిద్దరి ఫలితం ఉండగా అనూహ్యంగా మాటల మాంత్రికుడు ఫ్యాక్షన్ తరహా కథ అరవింద సమెతలో అద్భుతంగా జూనియర్ ఎన్టీఆర్ ని చూపించాడు.

ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి ఎన్‌టి‌ఆర్ కోసం కుమ్మెసే స్క్రిప్ట్ ఒకటి సిద్ధం చేసినట్లు స్క్రిప్టు మొత్తం ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ ఫోన్ లో చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో చెర్రీ తో ‘RRR’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోపక్క త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే బన్నీ తో చేయబోయే సినిమా ఫిబ్రవరి కి పూర్తవుతున్న క్రమంలో అలాగే ఫిబ్రవరి నుండి ఎన్టీఆర్ కి ఎక్కువ సమయం దొరికే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలసి ఫిబ్రవరిలో స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఓకే అయితే…సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.