అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా తమన్నా.. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది

టాలీవుడ్లో ఎన్నో ఏళ్లుగా తిష్టవేసుకొని కూర్చున్న హీరోయిన్ ఎవరు అంటే తమన్నా అని అంటారు. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినపుడు ఆమెకు 13 ఏళ్ళు. అంత చిన్న వయసులో హీరోయిన్ గా ఎలా అంటే ఆలా కలిసి వచ్చింది. సినిమా చేసింది. విజయం సాధించలేకపోయినా ఎంట్రీ అదరగొట్టింది. ఆ సినిమా తరువాత తమన్నా తెలుగు ఇండస్ట్రీలో నిలబడిపోయింది.ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తమన్నాకు ఓ నిక్ నేమ్ ఉన్నది. అదేమంటే… మిల్కి బ్యూటీ అని. పాల నురుగులా తెల్లగా అందంగా ఉంటుంది. ఆ అందమే ఆమెకు ప్లస్ అయ్యింది.

అందరు డి గ్లామర్ గా కనిపించాలి అంటే మేకప్ తీసేస్తే సరిపోతుంది. కానీ, తమన్నా డి గ్లామర్ గా కనిపించాలి అంటే.. అలా మేకప్ వేయాలి. అది ఆమె రంగు. అందుకే ఆమెకు ఇండస్ట్రీలో మిల్కి బ్యూటీ అని పేరు పడింది.ఈ స్టార్ హీరోయిన్ ఇప్పటికి ఇండస్ట్రీలో నెట్టుకొస్తూనే ఉన్నది. ఇప్పటికి ఇంకా అవకాశాలు వస్తున్నాయి అంటే కారణం.. పరిచయాలే. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నది కాబట్టి ఆ పరిచయంతో సినిమాలు చేస్తున్నది. ఈ పరిచయాలే ఆమెకు కలిసి వచ్చింది. సినిమా అవకాశాలు తెచ్చిపైడుతున్నది. బాహుబలికి ముందు ఆమెకు పెద్దగా అవకాశాలు కనిపించలేదు. సీనియర్ కావడం వలనో లేదంటే.. హీరోయిన్ గా పాతపడిపోవడం వలనో తెలియదు.కానీ, బాహుబలిలో ఆమె యాక్టింగ్ కు జనాలు ఫిదా అయ్యారు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసింది. గతేడాది ఎఫ్ 2 సినిమాలో టార్చర్ పెట్టె గృహిణిగా మెప్పించింది.

సైరాలో లక్ష్మి పాత్రలో మెప్పించింది. పోరాట యోధురాలిగా మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో యాక్షన్ సినిమా చేస్తున్నది. అందులో యాక్షన్ తో పాటు గ్లామర్ గా ఆకట్టుకుంది. అందంగా ఉండటమే తనకు కలిసి వచ్చినట్టు చెప్తోంది తమన్నా. జాగ్రత్త తమన్నా ఆ అందం ఒక్కోసారి రివర్స్ కాగలదు. ఎందుకైనా మంచిది దిష్టి చుక్కపెట్టుకో..

Recommended For You

Leave a Reply

Your email address will not be published.