ఆ హీరో దగ్గర అలా పనిచేశాను… తమన్నా షాకింగ్ కామెంట్…

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా. ‘శ్రీ’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినప్పటికీ… ఆ తర్వాత ఈ అమ్మడు టాలీవుడ్లో అదిరిపోయే సినిమాల్లో నటించింది. 13వ ఏటనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిందన తమన్నా… తన కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలైన బాహుబలి, సైరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది.ఈ మిల్కీ బ్యూటీ తన అభినయంతోనే కాకుండా అందంతోనూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఈ యేడాది వరసగా ఎఫ్2, సైరా రెండు హిట్స్ అందుకుంది. ప్రస్తుతం తమన్నా కోలీవుడ్‌లో యాక్షన్ సినిమా చేస్తోంది.

దీంతో పాటుగా ఈ అమ్మడు హర్రర్ సినిమాల్లో కూడా చేస్తుండటం విశేషం.అవకాశాలు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో హిట్ సినిమాలో నటించి మరలా లైన్లోకి వస్తోంది.తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై తమన్నా స్పందిస్తూ, ‘యాక్షన్’ సినిమాలో విశాల్ జోడీగా నటించాను. ఆయనతో పాటు నేను కూడా కమెండో ఆఫీసర్‌గానే చేశాను. ఈ సినిమాలో నేను యాక్షన్ సీన్స్ .. ఛేజింగ్ సీన్స్‌లోను కనిపిస్తాను. ఈ తరహా పాత్రను చేయడం థ్రిల్లింగ్‌గా అనిపించింది.ఇక ఫైట్లు మాత్రమే కాదు .. విశాల్ కి నాకూ మధ్య రొమాంటిక్ సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా వుంటాయి. సుందర్ సి. దర్శకత్వం వహించిన ఈ సినిమా, నా కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.