తన మంచి మనసును చాటుకున్న తమన్నా.,..

‘కోవిడ్-19 వల్ల ఏర్పడిన ఈ భయంకర పరిస్థితి కొన్ని కోట్ల మంది జీవితాలపై అస్సలు ఊహించలేని విధంగా ప్రభావం చూపింది. ఈ వైరస్‌ను తరిమికొట్టాలంటే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్, సామాజిక దూరం ఒకటే మార్గం. లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తర్వాత నుండి దేశంలో కోట్లాది మంది రోజువారి వేతనం కార్మికులు, వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు, కూలీలు కూడు, గూడు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముంబై ,ఢిల్లీ మరియు హైదరాబాదు లాంటి మహానగరాల్లో ఎంతోమంది వలస కూలీలు చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .

అయితే వలస కూలీలు ఆదుకోవడానికి ఇటు ప్రభుత్వాలతో పాటు అటు మనసున్న ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు వారికి ఆహారం అందచేస్తున్నారు ముఖ్యంగా ముంబై లో ఇరుక్కుపోయిన వలస కూలీలు ఆదుకోవడానికి సినీ తారలు ముందుకు వస్తున్నారు తాజాగా వారి జాబితాలో కి మిల్కీ బ్యూటీ తమన్నా చేరారు. ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థతో తమన్నా కలసి ముంబైలోని వలస కార్మికులకు అండగా నిలిచారు తమన్నా. దాదాపు 50 టన్నుల ఆహార పదార్థాలను 10వేల మంది వలస కూలీల కు తమన్నా సిద్ధం చేయించింది.వలస కూలీల కు ఏదేని సహాయం చేద్దాం అన్న ఆలోచన ద్వారానే ఈ నిర్ణయానికి వచ్చిందని తమన్నా తెలియజేశారు. టాలీవుడ్ నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి పిలుపుతో అనేకమంది సినీ ప్రముఖులు తమ విరాళాలను అందజేశారు.

బాలీవుడ్లో కూడా అక్షయ్ కుమార్ 25 కోట్ల ధనాన్ని అందజేశారు. అదే విధంగా సల్మాన్ ఖాన్ 30 వేల మంది కుటుంబాలకు వారికి నిత్య అవసరాలు తీర్చేందుకు గానూ దత్తత తీసుకున్నాడు. ఇలా సినీ ప్రముఖులు తమకు తోచిన సాయం చేస్తూ ప్రజలను ఆదుకుంటున్నారు.ఈ లాక్‌డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదని ప్రతిజ్ఞ చేశాను. అంతేకాదు, ఇలాంటివారిని ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తు్న్నాను’’ అని తమన్నా చెప్పారు.