తలైవా ఫ్యాన్స్ ఏర్పాట్లు మామూలుగా లేవుగా

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఫ్యాన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఆయన సినిమాలంటే తమిళనాట పండగ వాతావరణం నెలకొంటుంది.కొన్ని కంపెనీలు అయితే ఏకంగా రజినీ సినిమా చూడండి అంటూ సెలవు ప్రకటించేస్తాయి.ఇంతటి క్రేజ్ ఉంది కాబట్టే ఆయన సూపర్ స్టార్ అంటారు మిగతా ఇండస్ట్రీ స్టార్లు.

 

ఇక రజినీ నటించిన లేటెస్ట్ మూవీ దర్బార్ చిత్రాన్ని జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ ఓ వినూత్న సాహసం చేయబోతున్నారు.తమిళనాడులోని సాలెంలో రజినీ ఫ్యాన్స్, అక్కడ ఏర్పాటు చేసిన రజినీ కటౌట్‌పై పూలవర్షం కురిపించేలా ప్లాన్ చేస్తున్నారు.ఓ హెలికాప్టర్ ద్వారా సినిమా రిలీజ్ రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ పూల వర్షం కురుస్తుందని వారు తెలిపారు.ఏదేమైనా రజినీ అంటే తమిళ తంబీలకు ఎలాంటి క్రేజ్ ఉందో ఈ విషయం చూస్తే తెలుస్తోంది.ఏదేమైనా రజినీ సినిమా సందడి అంటే తమిళ నాట మామూలుగా ఉండదు మరి.