తలస్నానం చేసే ముందు ఈ తప్పులు తెలిస్తే మళ్ళి చేయరు

మనిషికి మరింత అందాన్ని పెంచే శిరోజాలు అంటే అందరికి మక్కువే.అందులోనూ ఆడవాళ్ళూ వాళ్ళ కోరుకున్న జుట్టు కోసం ఎన్నో షాంపూలు,ఆయిల్స్ ను వాడుతుంటారు.కాని తలస్నానం చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమాలను పాటించాలి.సాధారణంగా మనకి తలస్నానం చేసినప్పుడు చాలా హాయి గా ఉంటుంది.మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉంటుంది. నిద్ర‌పోయే ముందు త‌ల‌స్నానం చేస్తే చ‌క్క‌ని నిద్ర సొంత‌మ‌వుతుంది. అయితే కొంద‌రు మాత్రం త‌ల‌స్నానం చేసేందుకు బద్ధకిస్తారు.ముఖ్యంగా స్త్రీలు అయితే త‌ల‌స్నానం చేసే విష‌యంలో కొన్ని పొర‌పాట్లు చేస్తుంటారు.దీని వ‌ల్ల వెంట్రుక‌లు రాలిపోవ‌డం, జుట్టు త‌క్కువ‌గా అవ‌డం, శిరోజాలు కాంతిని కోల్పోవ‌డం జ‌రుగుతుంది.

అలాంటి వారు త‌ల‌స్నానం చేసే విష‌యంలో కొన్ని సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.తలస్నానానికి చాలా మంది వేడినీళ్లనే ఉప‌యోగిస్తుంటారు కాని అలా చేయకూడదు. త‌ల‌స్నానానికి కేవ‌లం గోరు వెచ్చ‌ని లేదా చ‌ల్ల‌ని నీటిని మాత్ర‌మే వాడాలి. ఎందుకంటే వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు వేగంగా పొడిగా మారుతాయి. క‌నుక వేడి నీళ్లకు బదులుగా గోరువెచ్చటి నీళ్లతో చేస్తే మంచిది. దీని వల్ల షాంపూ, కండిషనర్లు కూడా వెంట్రుకలపై బాగా పనిచేస్తాయి. దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది.షాంపూతో తలస్నానం చేసేముందు వెంట్రుకలను నీళ్లతో బాగా కడుక్కోవాలి అంటే ఎక్కువ సేపు నీళ్ళతో జుట్టును నానబెట్టాలి అన్న మాట ,షాంపూను తలకు రాసుకోబోయే ముందు కనీసం ఒకటి రెండు నిమిషాల పాటు జట్టును షవర్‌ కింద ఉంచాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బాగా తడుస్తాయి. అప్పుడు జుట్టులో ఉన్న దుమ్ము ధూళి తొందరగా వదిలి మ‌నం అనుకున్న ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌వ‌చ్చు. దీని వల్ల శిరోజాలు సంర‌క్షింప‌బ‌డ‌తాయి.