లవ్ లో నటి తాప్సి.. ప్రియుడు ఎవరో తెలుసా..?

ఢిల్లీ సొగసరి,సొట్ట బుగ్గల సుందరి తాప్సీ తాను ప్రేమలో వున్నానని తెలిపింది.ప్రియుడి పేరు చెప్పకుండానే అతను చాలా గొప్పవాడని ప్రశంసలతో ముంచెత్తింది.తాను ప్రేమిస్తున్న వ్యక్తిని చూసి ఎంతో గర్వపడుతున్నానని,అతని సాంగత్యం ఎంతో ఆనందాన్నిస్తోంది.అతనితో నా ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాను అని తాప్సీ పేర్కొంది.ఇక నా ప్రియుడు నటుడు,క్రికెటర్‌ కాదు.సినిమాలకు సంబంధించిన వ్యక్తి కాదు..అసలు అతను ఎవరో నాకు,నా చెల్లికి తప్పా ఎవరికి తేలీయదు.ఇక నాజీవితంలో పిల్లలు కావాలి అనిపించినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అన్నారు.

ఇక ఓ వ్యక్తితో తాప్సీ డేటింగ్‌లో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నవిషయం తెలిసిందే.ఇక తాప్సీ రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది ఈ చిత్రంలో తాప్సీ న‌ట‌న‌కి మంచి మార్కులే ప‌డ్డాయి.ఇక ఈ సినిమా త‌ర్వాత తెలుగులో చాలా ఆఫ‌ర్సే వ‌చ్చిన‌ప్పటికి ఆ సినిమాలు తాప్సీ కెరియ‌ర్ కి అంతగా హెల్ప్ కాలేదు.అయితే తమిళంలో గంగ సక్సెస్ తర్వాత,హిందీలో ఛాన్స్ లు రావడం, అక్కడ పింక్ అంటూ అమితాబ్ తో కలిసి హిట్ కొట్టేయడం,ఆ తర్వాత అక్షయ్ మిషన్ మంగళ్ చిత్రం హిట్ అవ్వడంతో,తాప్సీకి ఇక పట్టపగ్గాలు లేకుండా పోయాయి.

ఇప్పుడు తాజాగా తడ్కా‘సాండ్‌ కీ ఆంఖ్‌’లో నటిస్తుంది. రియ‌ల్ స్టోరీ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాప్సీ,భూమి పెడ్నేకర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌ మహిళా షూటర్లు చంద్రో,ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా తుషార్‌ హీరానందని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది. మరోపక్క తమిళ్ స్టార్ జయం రవి నటిస్తున్న సినిమాకు కూడా సంతకం చేసారు..ఒకప్పుడు నాకు వాలెంటైన్స్‌ డే అంటే అస్సలు పడదు.నేను ఎవరితోనూ ప్రేమలో పడను అని చెప్పిన తాప్సి ఇప్పుడు ప్రేమలో వున్నానని చెప్పడం ఒకింత విడ్డూరమని అనుకుంటున్నారు కొందరు.