సైరాకు అసలు దెబ్బ ఇదే..? అంచనాలను అక్కడే అందుకోలేకపోయింది

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా నిర్మించబడిన పీరియాడిక్ డ్రామాగా సై రా అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సై రా నర్సింహా రెడ్డి చిత్రం లో ప్రతి సన్నివేశాన్ని భారీగా రూపొందించారు నిర్మాత. ఈ చిత్రం అన్ని హంగులతో పూర్తయ్యే సరికి బాహుబలి బడ్జెట్ ని చేరుకుంది. బాహుబలి లాగా ఈ చిత్రం లో హై లెవెల్ ఎలేవేషన్స్ లేకపోవడం తో సినిమా కాస్త ప్రేక్షకుల్ని రక్తి కట్టించలేకపోయింది. ఈ సినిమా స్వాతంత్ర్య పోరాట యోధుడైన ఉయ్యాలవాడ జీవిత గాదని చూపించడం, అతను కాస్త తెలుగు వాడు అయి ఉండి ఉండడంతో ప్రేక్షకులు దీనిని పాన్ ఇండియన్ మూవీ గా చూడలేకపోయారు.

బాహుబలి చిత్రాన్ని రాజమౌళి చాల అద్భుతం గా తెరకెక్కించారు, ట్విస్టులతో, ప్రభాస్ తో పాటు ప్రతి ఒక్క చిన్న విషయం పై చాల ఫోకస్ చేసారు, మాహిష్మతి రాజ్యాన్ని చక్కగా చూపించారు. ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ గా బాహుబలి తెరకెక్కడం తో కలెక్షన్లు బాగా వచ్చాయి. సై రా విషయం లో పైవేవీ జరగలేదు. ట్విస్టులు లేకుండానే సినిమా సాగడం, తమన్నాతో ప్రేమాయణం, సినిమా నిడివి ఎక్కువ ఉండటం సై రా కి కలిసి రాలేదని చెప్పాలి. చిరంజీవి కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో భారీ కలెక్షన్లు ఇక్కడ వస్తున్నాయి అని, అన్ని భాషలలో ఆలా జరగడం లేదని మనందరికీ అర్ధం అవుతుంది. మరి దసరా పండగ సమయాన్ని సై రా ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.