సూర్య ఎమోషనల్…స్టేజ్ పైనే ఏడ్చేసాడు..!

తమిళ స్టార్ హీరో సూర్య సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా హీరోగా పదిమంది మన్ననలు పొందుతున్నాడు.అగరం అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన సూర్య అనేక సామాజిక కార్యక్రమాలను చూపడుతూ పలువురుకి ఆదర్శంగా నిలుస్తున్నాడు.పేద విద్యార్ధులకు ఉచిత విద్యను అందించడంలో సూర్య ఎప్పుడూ ముందుంటానని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్నాడు.అయితే ఇంత మంచి పని చేస్తున్న సూర్య, ఓ అమ్మాయి మాటల వల్ల బోరున విలపించాడు.

 

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? సూర్య బోరున ఏడవడానికి కారణమేమిటి? అనుకుంటున్నారా.అసలు విషయంలోకి వెళ్తే.అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్ధులకు ఎంతమేల జరుగుతుందో అనే విషయాన్ని అందరికీ తెలిపేందుకు ఓ వేడుకని నిర్వహించారు ఆ సంస్థ నిర్వాహకులు.అయితే ఈ వేడుకలో గాయత్రి అనే అమ్మాయి, తన తండ్రి క్యాన్సర్ బాడిన పడటం, తల్లి ఒక్కతే సంసారాన్ని నెట్టుకొస్తుండటంతో తాను ఇక చదువుకోలేనేమో అనుకుని భయపడిందట.కానీ అగరం ఫౌండేషన్ పుణ్యమా అని, తాను కష్టపడి చదువుకుని గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే కాకుండా ఇంగ్లీష్ ట్యూటర్‌గా ఉద్యోగం కూడా సాధించానంటూ ఆ వేదికపై ఉద్వేగంతో చెప్పకొచ్చింది.ఇదంతా అక్కడే కూర్చుని వింటున్న సూర్య కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.బోరున ఏడుస్తూ ఆ అమ్మాయిన గట్టిగా అలుముకున్నాడు.అటుపై అగరం సంస్థ ద్వారా అనేక మంది పేద విద్యార్దులకు విద్యను అందించేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు.ప్రస్తుతం సూర్య భాగోద్వేగంతో ఏడ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.